జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ కోసం కేసీఆర్ రిక‌మండేష‌న్…!

May 28, 2019 at 10:13 am

జగన్ కేబినెట్‌లో ఎవరెవరికి బెర్త్‌లు దక్కుతాయ‌న్న‌ది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 30న జగన్ ఒక్కరే విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తారని ఆ తర్వాత వారం పది రోజులలోగా కేబినెట్ ఏర్పాటు ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్‌లో మొత్తం 25 మందికి చోటు దక్కనుంది. దీంతో ఎవరికి వారు సామాజికవర్గాలు, ప్రాంతాలు, సీనియార్టీ ఆధారంగా పైరవీలు ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్‌కు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య మంచి రిలేషన్ ఉందన్నది వాస్తవం. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్‌లో ఓ వ్యక్తి కి మంత్రి పదవి దగ్గర కేసీఆర్ రికమండేషన్ చేస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇంత‌కు కేసీఆర్ రికమెండ్ చేస్తారంటోన్న ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు.

సామాజిక సమీకరణ‌ల పరంగా వెల‌మ‌ సామాజిక వర్గానికి ఒక కేబినెట్ బెర్త్‌ ఇస్తారని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో బొబ్బిలి నుంచి సుజయకృష్ణ రంగారావుకు ఈ సమీకరణ‌ల్లో కేబినెట్ బెర్త్ లభించింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సుజయకృష్ణ ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ బెర్త్‌ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆశిస్తున్నారు. 2004లో ప్రతాప్ అప్పారావుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండదండలతోనే తొలిసారిగా ఎమ్మెల్యే సీటు దక్కింది. కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వంతో 2004 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ప్రతాప్ ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఓడినా ఆయన 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు వరుస విజయాలు సాధించారు. మొత్తంగా మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ప్రతాప్ జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడినా జిల్లాలో ఆ పార్టీ నుంచి గెలిచిన వారిలో ప్ర‌తాప్ ఒక‌రు. ఈ క్రమంలోనే వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రతాప్ అప్పారావుకు మంత్రి పదవి ఇవ్వాలని తమ సామాజికవర్గానికి చెందిన తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా జగన్‌కు రిక‌మెండేష‌న్‌ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మచ్చలేని రాజకీయ నేపథ్యం, అవినీతికి దూరంగా ఉండటం ప్రతాప్‌కు కలిసి రానున్నాయి. కేసీఆర్ చెప్తే జగన్ కాదనే పరిస్థితి ఉండదని వెలమ సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారు. మరి ప్రతాప్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో జగన్ మదిలో ఏముందో చూడాలి.

జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ కోసం కేసీఆర్ రిక‌మండేష‌న్…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share