జ‌గ‌న్ దెబ్బ‌తో ఇరుకున ప‌డ్డ కేసీఆర్‌

June 10, 2019 at 3:07 pm

అదేంటి? అని ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలానే అనుకుంటున్నార‌ట తెలంగాణ సీఎం కేసీఆర్‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న ఏం చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎవ‌రు ఆయ‌న‌ను ప్ర‌శ్నించినా.. తెలంగాణ ద్రోహులు అంటూ వారిపై ముద్ర‌వేసి.. ఫాంహౌస్‌లో ఉంటూ పాలనా సాగించేవారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ముఖ్యంగా ఏపీలో ప్ర‌భుత్వం మారింది. ఈ ప‌రిస్థితి కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని భావించారు. నిజ‌మే! అంద‌రూ కూడా ఇలానే అనుకున్నారు. జ‌గ‌న్ ఎలాగూ.. త‌న కొడుకుతో స‌మానంగా భావిస్తుండ‌డంతో ఎలాంటి చీకు, చింత లేకుండా ముందుకు సాగుతార‌ని భావించారు.

కానీ, ఇప్పుడు త‌ర‌చి చూస్తే.. ఏపీలో ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కూడా కాని ప్ర‌భుత్వం తీసుకుంటున్న సంచ‌ల‌న నిర్ణ‌యా లు, వేస్తున్న అడుగులు కేసీఆర్‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ తో పోల్చిన‌ప్పుడు.. జ‌గ‌న్ చాలా చిన్న వ‌య‌సులో ఉన్న సీఎం. అయిన‌ప్ప‌టికీ.. త‌న కేబినెట్‌లో ముగ్గురు మ‌హి ళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. వీరంతా కూడా ఎస్సీ, ఎస్టీలే. అంతేకాదు, ఏకంగా హోంశాఖ‌ను ఎస్సీ మ‌హిళ‌కు అప్ప‌గిం చారు. ఇప్పుడు ఇక్కడ జ‌రిగిన ప‌రిణామాలు తెలంగాణ‌లో కాక పుట్టిస్తున్నాయి. కేబినెట్‌లోకి మ‌హిళ‌ల‌నే తీసుకోకుండా గత ప్ర‌భుత్వాన్ని న‌డిపిన కేసీఆర్‌కు ఇప్పుడు కూడా తీసుకోవాల‌ని లేదు.

అయితే, ఏపీలో జ‌రిగిన ప‌రిణామాల‌తో అక్క‌డ డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక‌, జ‌గ‌న్ త‌న పాల‌న‌లో దూడుకు ప్ర‌దర్శిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిని చెప్పిన‌ట్టు అమ‌లు చేసేందుకు ఫ‌స్ట్ రోజునుంచి ప్ర‌య‌త్నిస్తున్నాడు. వీటి లో.. ప్ర‌ధానంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి కీలక నిర్ణయాలపై వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఏపీ పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా కూడా జగన్ ఇంతటి కీలక నిర్ణయా లు తీసుకుంటుంటే..ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో మాత్రం కెసీఆర్ మాత్రం ఏమీ పట్టించుకో వటం లేదనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సీఎం కెసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఓ హెచ్చరిక చేశారు.

ఇలాగే చేస్తే ఆర్టీసీ మూసేస్తామంటూ ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులు కూడా ఎప్పటి నుంచో సీపీఎస్ రద్దు చేయా లని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తరహాలో కెసీఆర్ ఈ రెండు అంశాలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కూడా ఓ వైపు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీలోనే ఈ రెండు కీలక అంశాలను అమలు చేస్తుంటే..ధనిక రా ష్ట్రం అయిన తెలంగాణలో మాత్రం ఎందుకు చేయరు అన్న ప్రశ్న ఉదయించటం ఖాయం. మొత్తంగా ఈప‌రిణామా లు కేసీఆర్‌ను ఇరుకున పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

జ‌గ‌న్ దెబ్బ‌తో ఇరుకున ప‌డ్డ కేసీఆర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share