ఖైదీ నెంబర్ 150 TJ రివ్యూ

సినిమా : ఖైదీ నెంబర్ 150
రేటింగ్ : 3.25 /5
పంచ్ లైన్ : తమ్ముడూ బాస్ కుమ్ముడే

నటీనటులు : చిరంజీవి,కాజల్,తరుణ్ అరోరా,ఆలీ,పోసాని,బ్రహ్మానందం తదితరులు.
కథ : మురుగదాస్
దర్శకత్వం : V. V. వినాయక్
నిర్మాత : రామ్ చరణ్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : R. రత్నవేలు
రైటర్స్ : పరుచూరి బ్రదర్స్,సాయి మాధవ్ బుర్ర.
ఎడిటింగ్ : రూబెన్
బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ .

స్టార్ స్టార్ ..మెగా స్టార్..ఎక్కడ చూసినా ఇదే నామస్మరణే…దాదాపు తొమ్మిదేళ్లయింది వెండితెరపై కనిపించి..తరం మారింది..అంతరం వచ్చింది..అలవాట్లు మారాయి..అభిరుచులు మారిపోయాయి..కానీ మెగా స్టార్ పై అభిమానం మాత్రం ఏ తరానికైనా చెక్కు చెదరదు, తరగదు అన్నది అక్షర సత్యం..ఇందులో ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే ఖైదీ నెంబర్ 150 థియేటర్స్ చుట్టుపక్కలకు వెళ్తే తెలుస్తుంది.సినిమా రివ్యూ కి దీనికి సంబంధం లేకపోయినా బెనిఫిట్ షో లో ఆ మెగా వేవ్ కి ఈ మాత్రం రాయొచ్చనిపించింది.దట్ ఈజ్ మెగా స్టార్.

ఇక సినిమా విషయానికి వస్తే..ఎన్నో కథలు, ఎందరో దర్శకులు.. ఇలా ఆ చేయి ఈ చేయి మారి..అనేక వివాదాలు దాటుకుని చివరగా వినాయక్ చేతికి చిక్కిన తమిళ సినిమా కత్తి కి రీమేక్ యే ఈ ఖైదీ నెంబర్ 150 .చిరంజీవి 150 వ సినిమా..అందులోనా కొణెదలా ప్రొడక్షన్స్ బ్యానర్ లో మొట్ట మొదటి సినిమా..అందరిలోనూ పైకి చెప్పక పోయినా లోలోపల మాత్రం టెన్షన్ నివురుగప్పుకునే వుంది.ఎట్టకేలకు సినిమా థియేటర్స్ ని తాకింది..బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుంది సింపుల్ గా చెప్తే.

ఒరిజినల్ సినిమా కథాంశం పైన ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు..అయితే బాస్ ని ఎలా చూపించబోతున్నారు..అనవసరపు ఆర్భాటాలకు పోయి స్టోరీ మెయిన్ ట్రాక్ ఏమైనా డామేజ్ చేసేస్తారేమో అన్న సందేహాలున్న మాట మాత్రం వాస్తవం.అయితే వినాయక్ తన అనుభవాన్నంతా రంగరించి..ఒక్క వినాయక్ యే కాదు టీం అంతా ఎంతో జాగ్రత్తగా అన్నయ్యని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తూ..కథ ఎక్కడా దేవియేట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా హేండిల్ చేశారు.

రైతులు..పల్లెటూళ్లు..కార్పొరేట్ కంపెనీలు ఈ కంటెంట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసాయి.అయినా వాటికి భిన్నంగా ఉంటుంది ఖైదీ నెంబర్ 150 .కరువు సీమలోని ఓ మాములు పల్లెటూరికి, 500 కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ కంపెనీ కి మధ్య జరిగే వార్ యే ఖైదీ నెంబర్ 150 .మురుగుదాస్ రాసిన ఈ కథ ప్రతి ఒక్కర్ని పల్లె పట్నం తేడా లేకుండా కదిలిస్తుంది.అంతటి డెప్త్ కంటెంట్ ఉన్న సబ్జెక్టు ఇది.ఒక రకంగా చూస్తే ఇప్పటిదాకా ఈ సినిమా ని తెలుగులో ఎవరూ ఎందుకు చేయలేదో అర్థం కాదు.మెగా స్టార్ యే మురుగుదాస్ కథకి తెలుగులో ప్రాణం పోయాలని రాసిపెట్టుందేమో.

మెగా స్టార్ ఎలా వుండబోతున్నాడు..డాన్స్ లు ఏంటి ఫైట్స్ ఎలా.. ఆ మానరిజంస్ ఎలా..అన్నిటిలో మునుపటి స్టైల్ ఉంటుందా ..ఆ గ్రేస్ తగ్గి ఉంటుందా ఇలా అనేక ఆలోచనలు ప్రతి ఒక్కరిలో..బట్ బాస్ ఈజ్ బ్యాక్..అదే గ్రేస్..అదే జోష్..బాస్ చెప్పినట్టు జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో మాత్రం తేడా ఉండదు.సేమ్ టు సేమ్.సినిమా మొత్తం మెగా స్టార్ తప్ప ఇంకొకకు గుర్తు రారు మనకి బయటికొచ్చాక కూడా..అంతటి ఇంపాక్ట్ ఇచ్చేసాడు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో.

హీరోయిన్ కాజల్ కి పెద్దగా పనిలేదు..ఇంపార్టెన్స్ అంతకంటే లేదు..మిగిలిన వాళ్లలో కమెడియన్స్ అలీ..బ్రహ్మానందం కామెడీ ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు..విలన్ తరుణ అరోరా పర్ఫెక్ట్ సెలక్షన్.మిగిలిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్స్ చిన్న చిన్న కేరక్టర్స్ లో మెరిశారు.పోసాని..పృద్వి తదితరులంతా పర్వాలేదనిపించారు.

వినాయక్ తెలివి తేటలన్నిటిని వాడి కథని చెడగొట్టే ప్రయత్నం ఎక్కడా చేయలేదు..ఎన్ని మార్పులు చేసినా కథకి ప్రాణం అయిన మాస్ సూసైడ్,కాయిన్ ఫైట్..క్లైమాక్స్ ప్రెస్ మీట్..ఈ మూడు మక్కి కి మక్కి దించేసాడు.అయితే కామెడీ ట్రాక్స్ ఇంకా బాగా హేండిల్ చేసుండాల్సింది.స్క్రీన్ప్లే కూడా అక్కడక్కడా డౌన్ అయినా మెగా మేనియా దాన్ని కవర్ చేస్తుంది.ఈ సినిమాకి అతి పెద్ద హై లైట్ డైలాగ్స్.పరుచూరి బ్రదర్స్ పీక్స్ చూపెట్టారు మాటలతో..సాయి మాధవ్ బుర్ర ట్రేడ్ మార్క్ డైలాగ్స్ కూడా మనకి వినిపిస్తాయి..రైతులపై రాసిన అన్ని డైలాగ్స్ ఎక్స్ట్రార్డినరీ.మనం ట్రైలర్ లో చూసినవి కాకుండా గుర్తున్న వేరే డైలాగ్స్ మీకోసం.

.పట్టణాలు పల్లెలకు పుట్టిన పిల్లలు.
.వెళ్లేవారూ కాపురాలకు పుట్టలేదు..కార్పొరేట్ కంపెనీ లకి పుట్టినారు.
.అసలు మీకు లంచ్ అవర్ అనేది ఇచ్చిందే రైతు
.నువ్వు లంచాలు తీసుకుని బలిసిపోయావ్..నేను నేరాలు చేసి అలసిపోయా..
.అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు రాదండి..

ఇలాంటి చాలానే వున్నాయి..విజిల్స్ ..అరుపులు..కేకల మధ్య సినిమాలో క్లాప్స్ కూడా వినిపిస్తాయి మనకు..ఇది చాలు ఈ సబ్జెక్టు లో ఎంత డెప్త్ ఉందొ చెప్పడానికి.ఇక కెమెరామెన్ రత్నవేలు మెరిపించాడు..కోరియోగ్రఫీ మరీ హెవీ గా టూ మచ్ గా లేకుండా మోతాదులో చేయడం బాగుంది.ఫైట్స్ బాగున్నాయి..ఎడిటింగ్ ఇంకా క్రిస్పీ గా వుండాల్సింది.మ్యూజిక్ పరంగా సాంగ్స్ అన్ని తెరపై అలరిస్తాయి..అయితే బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒరిజినల్ నే చాలా చోట్ల కాపీ చేసేసారు.

ఒరిజినల్ సినిమాలో వుండే హై వోల్టేజ్ ఇంటెన్సిటీ ఖైదీ నెంబర్ 150 లో లేకపోయినా మెగా స్టార్ దాన్ని కనపడనీయలేదు..అన్ని తానై మెగా ఫీస్ట్ ఇచ్చాడు అభిమానులకి. మెగా స్టార్ మొదటినుండి ఈ రీమేక్ సినిమానే ఎందుకు పట్టుబట్టాడో సినిమా చూస్తే అర్థం అవుతుంది.చిరంజీవి నుండి కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే బలమైన నేపథ్యం ఉన్న కథ ఇది.చిరు కం బ్యాక్ కి పర్ఫెక్ట్ సినిమా..బాస్ ఈజ్ బ్యాక్.