కిష‌న్‌రెడ్డికి సెంట్రల్ మినిస్ట‌ర్‌!

May 25, 2019 at 9:32 am

తెలంగాణ‌లో బీజేపీ ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సాధించిన ఫ‌లితాలు ఇప్ప‌ట‌కీ పెద్ద షాకింగ్‌గానే ఉన్నాయి. ఆ పార్టీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్ల‌లో విజ‌యం సాధించింది. ఉత్త‌ర తెలంగాణ‌లో ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ – నిజామాబాద్ లాంటి సీట్ల‌లో బీజేపీ గెల‌వ‌డం ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. దేశ‌వ్యాప్తంగా మోడీ గాలులు బలంగా వీచాయి. న‌మోః మోడీ మంత్రం బాగా ప‌నిచేసింది. ఈ ప్ర‌భావం కూడా ఉత్త‌ర తెలంగాణ‌లో కొంత వ‌ర‌కు ఉంద‌ని ఫ‌లితాలు చెప్పాయి. ఇక టీఆర్ఎస్ కంచుకోట‌లుగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ ప‌ట్టు సాధిస్తోంది అంటే టీఆర్ఎస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన‌ట్టే.

ఇక సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ కిష‌న్‌రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కిష‌న్‌రెడ్డి పార్టీలో సీనియ‌ర్‌. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే ఓడిపోయారు. ఇక కిష‌న్‌రెడ్డి మంత్రి ప‌ద‌వి కోసం చాలా ఆశ‌తో ఉన్నారు. అయితే ఇప్పుడు మంత్రి ప‌ద‌వి రేసులో కిష‌న్‌రెడ్డికి పోటీగా నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఈ ఎన్నిక‌ల్లో అర‌వింద్ ఏకంగా సీఎం కుమార్తె క‌విత‌ను ఓడించి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. అర‌వింద్ పార్టీలో చేరింది రెండేళ్ల క్రిత‌మే. కిష‌న్ చాలా సీనియ‌ర్‌. 1980 నుంచి బీజేపీలో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కన్వీనర్‌గా, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా, కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు. 2010లో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఇక 2004లో హిమాయ‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా, 2009, 2014లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్ట‌డంతో పాటు శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎంపిక‌య్యారు.

బీజేపీ తెలంగాణ‌పై ఈ సారి గట్టిగా దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఏర్ప‌డ‌బోయే మంత్రి వ‌ర్గంలో తెలంగాణ నుంచి ఒక‌రికి ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి రానుంది. ఈ ప‌ద‌వి కోసం స‌హ‌జంగానే కిష‌న్‌రెడ్డి ముందు ఉన్నా… క‌విత‌ను ఓడించిన అర‌వింద్ బీసీ కావ‌డంతో ఈ కోటాలో ఏమైనా ఆయ‌న పరిశీల‌న‌కు వ‌స్తుందా ? అన్న సందేహం కూడా ఉంది.

కిష‌న్‌రెడ్డికి సెంట్రల్ మినిస్ట‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share