శర్మ రాకతో బాబులో ఒణుకు!

April 2, 2019 at 1:02 pm

త‌న‌కు అణువు కాక‌పోతే దేనికైనా తెగించే బాబు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా కేకే శ‌ర్మ‌ను త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తోంది. త‌న వారిని మాత్ర‌మే పెద్ద కూర్చీలో కూర్చోబెట్టి పావులు క‌దుపుతూ ప‌నులు కానిచ్చుకోవాల‌ని కోరుకునే చంద్ర‌బాబు శ‌ర్మ నియామ‌కాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ను ఖాత‌రు చేయ‌ని టీడీపీ ఇప్పుడు మ‌ళ్లీ త‌న త‌ల‌బిరుసును చూపించుకుంటోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను స‌సేమిరా మార్చ‌మ‌ని ఏకంగా కోర్టుకెక్కి బోర్ల‌ప‌డిన చంద్ర‌బాబు ఇప్పుడు శ‌ర్మ విష‌యంలో తిరిగి త‌న ఏక‌ప‌క్ష వైనాన్ని రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఎన్నిక‌ల వేళ అధికారుల‌ను, సిబ్బందిని త‌న‌కు న‌చ్చిన‌, త‌నా అనుకున్న స్థానాల్లో పెట్టుకుని ఇష్ట‌మున్న‌ట్టు ఆట‌లాడొచ్చ‌నే రీతిలో ఉన్న చంద్ర‌బాబుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇస్తున్న ఒక్కో ఝ‌ల‌క్‌కు క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి మ‌ర‌ణాన్ని రాజ‌కీయంగా ల‌బ్ధికోసం ఉప‌యోగించుకుంద‌ని భావించి పోలీస్ వ్య‌వ‌స్థ‌ను క‌నుస‌న్న‌ల్లో న‌డిపిన బాబు అడ్డంగా బుక్క‌య్యారు. వైసీపీ కోర్టును ఆశ్ర‌యించి, విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ద్రుష్టికి తీసుకెళ్ల‌డంతో బాబు బండారం బ‌య‌ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీకి అతిగా కొమ్ముకాస్తున్న ముగ్గురు ఉన్న‌తాధికారుల‌ను త‌ప్పించిన విష‌యం తెలిసిందే.

ఈ విష‌యంలో ఇద్ద‌రిని వ‌దులుకోవ‌డానికి చాలా ఇబ్బంది ప‌డిన చంద్ర‌బాబు త‌న ప్ర‌ధాన అనుచ‌రుడు, తెలుగుదేశానికి వీరవిధేయుడిగా సేవ‌లు చేస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మాత్రం వ‌దులుకోవ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేయ‌గా కోర్టు మెట్టిక్కాయ‌లు వేయ‌డంతో వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. ఇప్పుడు అదే వ‌రుస‌లు ఏపీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా వ‌స్తున్న కేకే శ‌ర్మ విష‌యంలో కూడా చంద్ర‌బాబు లేని రాద్ధాంతాన్ని తెర‌పైకి తెచ్చి త‌నా అనుకున్న వారికోసం ఇంకో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. శ‌ర్మ వంటి నిక్క‌చ్చి మ‌నిషి ఉంటే త‌ను పప్పులు ఉడ‌క‌వ‌ని ఎరిగిన బాబు ఇప్పుడు త‌ట్టుకోలేక ఆయ‌న రాక‌ను ఆప‌డానికి ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాడు.

శర్మ రాకతో బాబులో ఒణుకు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share