జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కొడాలి నాని న‌ట‌న నేర్పాడు… ఏపీ మంత్రి సంచ‌ల‌నం

June 26, 2019 at 12:52 pm

టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు, ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి కొడాలి నానికి ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొడాలి నానిని ఎన్టీఆర్ అన్నా… అన్నా అంటూ అప్యాయంగా ప‌ల‌క‌రిస్తారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఇంత అనుబంధానికి ఎన్టీఆర్ తండ్రి దివంగ‌త హ‌రికృష్ణే కార‌ణం. ఎన్టీఆర్ గుంటూరులోని విజ్ఞాన్ స్కూల్స్‌లో చ‌దువుకున్న‌ప్పుడు కొడాలి నాని అన్ని ద‌గ్గ‌రుండి చూసుకునేవారు.

ఇక ఆంధ్రావాలా ఫంక్ష‌న్ ఎన్టీఆర్ స్వ‌గ్రామం నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌డం వెన‌క కూడా నాని ప్లాన్ చాలానే ఉంది. ఆ త‌ర్వాత నానికి 2004లో టీడీపీ టిక్కెట్ రావ‌డంలో ఎన్టీఆర్ కృషి ఉంది. నాని ఎమ్మెల్యేగా గెలిచాక ఎన్టీఆర్‌తో సాంబ సినిమా తీశారు. ఆ త‌ర్వాత నాని టీడీపీతో విబేధించి వైసీపీలోకి వెళ్లి వ‌రుస‌గా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు ప్ర‌స్తుతం మంత్రి అయ్యారు.

తాజాగా ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు కొడాలి నాని మంత్రి కావడంతో ఆయనకు అభినంద‌న స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌లో కృష్ణా జిల్లాకే చెందిన మ‌రో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు యాక్టింగ్‌లో మెళ‌కువ‌ల నేర్ప‌డంతో పాటు ఓన‌మాలు నేర్పింది కూడా కొడాలి నానీయే అంటూ పొగ‌డ‌డంతో అక్క‌డున్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

మొత్తానికి కొడాలి నానిని ఆకాశంలోకి ఎత్తేక్ర‌మంలో పేర్ని నాని కాస్త అతిగానే పొగిడేశారనిపించింది. అలాగే ఎన్టీఆర్ ఈ స్థాయిలో హీరోగా ఉండడంలో కొడాలి నాని పాత్ర మరవలేనది అని కూడా పేర్ని తెలిపారు. ఏదేమైనా పేర్ని నాని చెప్పిన‌ట్టు కాక‌పోయినా ఎన్టీఆర్ ఎదుగుద‌ల‌లో కొడాలి పాత్ర మాత్రం కొంత వ‌ర‌కు ఉంద‌న్న‌ది నిజం. ఇక కొడాలి నాని – పేర్ని నాని కూడా అత్యంత స‌న్నిహితులు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కొడాలి నాని న‌ట‌న నేర్పాడు… ఏపీ మంత్రి సంచ‌ల‌నం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share