కోదండ‌రాం సీటుపై సైలెంట్ ఇందుకేనా..?

September 25, 2018 at 4:16 pm

తెలంగాణ జ‌న‌స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఏ స్థానం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్నార‌నే విష‌యంపై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు వినిపిస్తున్నా.. ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. కోదంద‌రాం సీటు విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా చూడ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దే ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న‌దానిపై అన్నివ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యం టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఓ టార్గెట్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. ఈ ఎన్నిక‌ల్లో కొంద‌రు నేత‌ల్ని ఎలాగైనా ఓడించాల‌న్న క‌సితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు టీపీసీసీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డితోపాటు కోదండరాం కూడా ఉన్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. It-s-Official--Mahakutami-Materializes--1536738391-16

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఆయ‌న సీటు విష‌యం బ‌య‌ట‌కు రాకుండా మ‌హాకూట‌మి నేత‌లు వ్యూహాత్మ‌కంగా ఉంటున్న‌ట్లు పులువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే.. కోదండ‌రాం పోటీపై ప‌లు స్థానాల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందుకోసం క‌లిసివ‌చ్చే లెక్క‌లు వేసుకుంటూ టీజేఎస్‌వ‌ర్గాలు ముందుకు వెళ్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా కోదండ‌రాం సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన మంచిర్యాల పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇక్క‌డ సింగ‌రేణి కార్మికుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రోవైపు ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాలోని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కోదండ‌రాం కు ఈ రెండు కూడా సేఫ్ జోన్ల‌ని తెలంగాణ జ‌న‌స‌మితి నేత‌లు అంచ‌నాలు వేస్తున్నారు. ఇందుకోసం అంత‌ర్గతంగా స‌ర్వేలు కూడా చేయించిన‌ట్లు తెలుస్తోంది.lokadhar-N55b3d9b97539cf0.68603580

కోదంరాంకు విద్యావంతులు అధికంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గ‌మైతేనే మంచిద‌నే వాద‌న పార్టీవ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తున్నాయి. వరంగల్‌ వెస్ట్‌ పరిధిలోనే కాకతీయ యూనివర్సిటీ ఉండటం, ఇక్క‌డి అధ్యాప‌కుల‌తోపాటు విద్యార్థిలోకంపై కొంత‌మేర‌కు వామ‌ప‌క్ష భావ‌జాలం ఎక్కువ‌గా ఉండ‌డం.. నియంత‌`త్వ పోక‌డ‌ను నిల‌దీసే త‌త్వం ఉండ‌డం..క‌లిసివ‌చ్చే అంశంగా చెబుతున్నారు. అంతేగాకుండా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇత‌ర‌రంగాల పెద్ద‌లు కోదండ‌రాంకు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కాంగ్రెస్ నేత నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఈ సీటును కోదండ‌రాంకు వ‌దిలిపెడుతారా..? అన్న‌ది డౌటే. రాజేంద‌ర్‌రెడ్డి బ‌రిలోకి దిగితే… టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్‌ను సుల‌భంగా ఓడించ‌వ‌చ్చున‌న్న టాక్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మ‌రోవైపు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం పేరు కూడా వినిపిస్తోంది. అయితే.. మ‌హాకూట‌మి ఏర్పాటు నేప‌థ్యంలో ఈ సీటును దేవేంద‌ర్‌గౌడ్ కుమారుడు అగుతున్నట్లు తెలుస్తోంది.

కోదండ‌రాం సీటుపై సైలెంట్ ఇందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share