ఎట్టకేలకు కోదండరాంకు ఆ సీటు ఖరారు ..!

November 5, 2018 at 11:46 am

తెలంగాణాలో మహాకూటమి పోటీచేసే సీట్లపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తుంది. నిన్నటి వరకు ఏ సీట్లోలో ఏ పార్టీ పోటీ చేయాలి అనే దానిపై ఓవైపు చర్చలు జరుగుతున్న ఈ ప్రక్రియ మాత్రం ఓ కొలిక్కి రాలేదు. తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో పాటు సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి.192395

కోదండరాం పోటీచేసే సీటుపై సరైన క్లారిటీ లేదు ముందుగా ఆయన మంచిర్యాల నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సెటిలర్స్ ఎక్కువగా ఉన్నా ఆంధ్రా సరిహద్దు నియోజకవర్గం అయిన మిర్యాలగూడ నుంచి కూడా ఆయన పేరు వినపడింది. ఇక సిపిఐ నుంచి చాడా వెంకటరెడ్డి ముందు నుంచి హుస్నాబాద్ సీటు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ ఆ సీటును వదులుకునేందుకు సుముఖంగా లేకపోవడంతో హుస్నాబాద్ సీటుపై కాంగ్రెస్ వర్సెస్ సి.పి.ఐ మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది.ఇదిలా ఉంటే కోదండరాం ఎన్నికల బరిలోకి దిగడం ఖాయం అని తేలింది. ఇప్పటివరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా మహాకూటమి అభ్యర్థుల తరపున తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారా అన్న దానిపై రకరకాల సందేహాలు వచ్చాయి.కూటమిలోని మిత్రపక్షాల కోరిక మేరకు కోదండరాం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఆయన సింగరేణి ప్రభావం ఎక్కువగా ఉన్న రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఇప్పటికే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు సీటు ఖరారు చేసింది.Kodandaram_TJS_Facebook_3x2

ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు పేరు ఖరారు చేయడంతో ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. టిఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ కోరుకంటి చందర్,కందుల సంధ్యారాణి టిఆర్ఎస్ రెబల్స్గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.బిజెపి ఈ స్థానం నుంచి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనితను రంగంలోకి దింపింది.గత ఎన్నికల్లో టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ కేవలం 2295 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో సైతం ఆయన రెబల్ గా పోటీ చేస్తే టిఆర్ఎస్ ఓట్లు భారీగా చీలిక తప్పదు. టిఆర్ఎస్ అధిష్టానం సైతం ఈ ఇద్దరు రెబల్స్ ను ఎప్పటి వరకు పిలిపించి మాట్లాడలేదు.ఇదే టైమ్లో కోదండరాం ఇక్కడ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ పార్టీలతోపాటు నియోజకవర్గంలో బలంగా ఉన్న సింగరేణి కార్మికుల మద్దతుతో సులువుగా విజయం సాధించవచ్చునని మహాకూటమి ప్లాన్. మరి కోదండరాం ఫైనల్ గా నామినేషన్ల పర్వం దగ్గర పడే వేళ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

ఎట్టకేలకు కోదండరాంకు ఆ సీటు ఖరారు ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share