క‌ట‌క‌టాల వెన‌క్కి కోడెల ఫ్యామిలీ..!

June 9, 2019 at 12:54 pm

అధికారాన్ని అడ్డు పెట్టుకుని విర్ర‌వీగిన మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబం త్వ‌ర‌లోనే జైలు ఊచ‌లు లెక్కిం చ బోతోందా? ఎక్క‌డిక‌క్క‌డ దౌర్జ‌న్యాలు, దారుణాల‌కు ఒడిగ‌ట్టిన ఈ కుటుంబం.. ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పిచేసిందా? ఈ నేప థ్యంలోనే పాపం పండి.. ఇప్పుడు కేసులు ముసురుకుని.. జైలుకు వెళ్లేందుకు రెడీ అయిందా? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ నాయ‌కుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. గ‌త చంద్ర‌బాబు ప్ర భుత్వంలో ఐదేళ్ల‌పాటు స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు అయితే, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయ‌న కుమారుడు కోడె ల శివ‌రామ‌కృష్ణ‌, ఆయ‌న‌కుమార్తె డాక్ట‌ర్ పూనాటి విజ‌య‌ల‌క్ష్మిలు ప్ర‌జ‌ల‌పై ప‌డ్డారు.

అందిన కాడికి అందిన‌ట్టు దోచుకున్నార‌నే వ్యాఖ్య‌లు గుంటూరులో జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేట్యాక్స్ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తెలు వ్య‌వ‌హ‌రించిన తీరుపై వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాలు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌తంలో కోడెల కుమారుడికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఇక్క‌డ విప‌క్షాలు నిర‌స‌న‌ల‌కు కూడా దిగాయి. ఇక ఇప్పుడు ఏకంగా కేసులు న‌మోద‌య్యాయి. తండ్రి కోడెల స‌త్తెన ప‌ల్లి నుంచి ప్రాతినిధ్యం వ‌హించ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అరాచ‌కాల కు కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ తెర‌దీశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా.. ముందుగా ఇక్క కేట్యాక్స్ క‌ట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలోనే స్థానికంగా అపార్ట్‌మెంట్ల‌ను నిర్మించే వారిని బెదిరించి మ‌రీ కేట్యాక్స్‌ను వ‌సూలు చేశారు. ఈ క్ర‌మంలో ఒక అపార్ట్‌మెంట్ నుంచి రూ.17 ల‌క్ష‌ల‌కు ట్యాక్స్ విధించారు. దీంతో అంత ఇచ్చుకోలేన‌ని బ్ర‌తిమాలిన బాధితుడిపై భౌతిక దాడికి కూడా దిగారు. ఈ క్ర‌మంలో కోడెల కుమారుడికి స‌హాయ‌కుడిగా ఉన్న గుత్తా నాగ‌ప్ర‌సాద్‌, ఇంజ‌నీర్ వేణుగోపాల‌రావు లుఇలాంటి కార్య‌క్ర‌మాల్లో సిద్ధ‌హ‌స్తులుగా పేరుతెచ్చుకున్నారు. బెదిరించి వసూళ్లు చేయ‌డంలో ఈ ఇద్ద‌రూ కీల‌కం. అయితే, తాజాగా వీరి బారిన ప‌డి, విల‌విల్లాడిపోతున్న కాంట్రాక్ట‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ఏ1గా కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ పేరును చేర్చ‌డంతో జిల్లాలో సంచ‌ల‌నం ఏర్ప‌డింది.

ఏక్ష‌ణానైనా కోడెల శివ‌రాంను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక‌, కోడెల కుమార్తె.. డాక్ట‌ర్ పూనాటి విజయ ల‌క్ష్మి కూడా ఏం త‌క్కువ తిన‌లేదని అంటున్నారు గుంటూరు వాసులు. త‌న అనుచ‌రుల‌తో బెదిరింపుల‌కు దిగి, భౌతిక దాడులు చేసి ప్ర‌జ‌ల నుంచి క‌మీష‌న్ల రూపంలో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు గుంచిన‌ట్టు కేసు న‌మోదైంది. ప‌ద్మావ‌తి అనే మ‌హిళ కేశ‌న‌ప‌ల్లిలో కొంత పొలం కొనుక్కుని సుబాబుల్ సాగు చేప‌ట్టారు. అయితే, ఈ పొలంపై క‌న్నేసిన విజ‌య‌ల‌క్ష్మి ముఠా.. ప‌ద్మావ‌తిని త‌మ కార్యాల‌యానికి పిలిచి కొట్టి.. 20 ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. ఆ పొలం త‌మ‌ద‌ని బెదిరించారు. భౌతిక దాడుల‌కు దిగారు. దీంతో బెదిరిపోయిన ప‌ద్మావ‌తి 15 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకుంది. అయినా వేధిస్తుండ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఏ3గా స్పీక‌ర్ కోడెల కుమార్తె పేరును ఈ కేసులో చేర్చారు పోలీసులు. ఇలా త్వ‌ర‌లోనే కోడెల కుటుంబం క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

క‌ట‌క‌టాల వెన‌క్కి కోడెల ఫ్యామిలీ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share