కోట‌గిరి గెలుపుపై కొత్త‌బెట్టింగులు.

May 6, 2019 at 1:55 pm

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏలూరు. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ మాగంటి బాబు. గ‌తంలో కుటుంబం మొత్తం కాంగ్రెస్‌లోనే ఉండ‌డం, ఆయ‌న కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇక్క‌డ ఎంపీగా విజ‌యం సాధించారు.ఇ క‌, 2009లో రాష్ట్ర రాజకీయాల ప‌రిణామాల నేప‌థ్యంలో బాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు ,2014 లో రాష్ట్ర విభజన ,మారిన రాజకీయాల నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్ నుండి 2014లో టీడీపీ టికెట్ పై ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ మాగంటి బాబు పోటీ చేశారు. అదే స‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీధ‌ర్ పోటీ చేశారు.

దీంతో రాజ‌కీయంగా ఈ స్థానంపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు నాటి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఎ న్నిక‌ల త‌ర్వాత ప‌రిస్థితి మాత్రం వైసీపీకి అనుకూలంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ ఓవిషయం చెప్పుకోవాలి. గ‌తంలో ఎన్న‌డూ గ‌డ‌ప కూడా దాట‌ని మాగంటి బాబు ఫ్యామిలీ ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్ర చారం చేశారు. ఆయ‌న స‌తీమ‌ణి, కుమారుడు , కుమార్తె కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి ప‌సుపు-కుంకుమ ఇచ్చి మ‌రీ త‌మ‌కు ఓటు వేయా ల‌ని కోర‌డం గ‌మ‌నార్హం. ఇక‌, నియోజ‌వ‌క‌ర్గాల వారీగా ఈ ఎంపీ ప‌రిధిలో టీడీపీ ప‌రిస్థితిని అంచ‌నా వేస్తుంటే.. బాబు గెలు పుపై సందేహాలు ముసురుకున్నాయి.

ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలోకి వ‌చ్చే అసెంబ్లీ స్థానాల్లో రెండు నూజివీడు,కైక‌లూరులు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. గ‌త ఎ న్నిక‌ల్లో ఇక్క‌డ నూజివీడులో వైసీపీ విజ‌యం సాధించింది. కైక‌లూరులో బీజేపీ గెలిచింది. ఇక‌, దెందులూరు, ఏలూరు, పోల‌వ‌రం, చింత‌ల‌పూడి, ఉంగుటూరులో మాత్రం టీడీపీ విజ‌యం సాధించింది. తాజా ఎన్నిక‌ల్లో మాత్రం నూజివీడు, కైక‌లూరు స‌హా దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ హోరా హోరీ పోరు సాగింది. టీడీపీకి కంచుకోట‌గా భావించే దెందులూ రులోనే ప‌రిస్థితి తిర‌గ‌బ‌డే ప్ర‌మాదం ఉంద‌ని టీడీపీకి సంకేతాలు అందాయి. దీంతో కోట‌గిరి శ్రీధ‌ర్‌కు అనుకూలంగా కొత్త బెట్టింగులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు అయిన చింత‌ల‌పూడి, పోల‌వ‌రంలో వైసీపీ గెలుపు కాకుండా మెజార్టీ మీదే బెట్టింగులు న‌డుస్తున్నాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి శ్రీధ‌ర్‌కు భారీ మెజార్టీ రానుంది.

ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఏలూరు ఎంపీ సీటు గెలుపుపై బెట్టింగులు జోరందుకున్నాయి. గెలుపు విష‌యంలో స‌హ‌జంగా అటు మాగంటి, ఇటు కోట‌గిరి ఎవ‌రి ధీమాలో వారు ఉన్నా బెట్టింగ్‌ల జోరు విష‌యంలో కోట‌గిరి మీదే ఎక్కువ స్పీడ్‌గా ఉంది. ఇక శ్రీధ‌ర్ సైతం 50-60 వేల మెజార్టీతో ప‌క్కాగా గెలుస్తున్న‌ట్టు ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చేశార‌ట‌. ఇక బెట్టింగ్ రాయుళ్లు ముఖ్యంగా కోట‌గిరి శ్రీధ‌ర్ గెలుస్తాడ‌ని వైసీపీ నేత‌లు బెట్టింగ్‌ల జోరు పెంచేస్తున్నారు. మాగంటి గెలిస్తే.. డ‌బుల్ పందెం ఇస్తామ‌ని వైసీపీ నుంచి బెట్టింగుల ప‌రంప‌ర పెరుగుతోంది. దీనికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీ నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఫ‌లితాల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ మారుతున్న అంచ‌నాల నేప‌థ్యంలో మాగంటిపై పందేలు కాయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి నెల‌కొంది. మీరు రూపాయి కాయండి.. మేం రెండు రూపాయిలు ఇస్తాం అన్నా కూడా ఎవ‌రూ కూడా మాగంటి గెలుపుపై బెట్టింగులు క‌ట్ట‌డం లేదు. మ‌రి దీనిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుంందో చూడాలి.

కోట‌గిరి గెలుపుపై కొత్త‌బెట్టింగులు.
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share