చంద్ర‌బాబుకు కేటీఆర్ కౌంట‌ర్‌.. !

March 28, 2019 at 9:58 am

ప్ర‌తిదీ రాజ‌కీయం చేసి, ర‌చ్చ‌ర‌చ్చగా మార్చే టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తెలంగాణ రాష్ర్ట స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. వైసీపీ నేత జ‌గ‌న్‌కు తెలంగాణ స‌ర్కార్‌కు ఏదో అనుబంధం ఉంద‌ని, జ‌గ‌న్‌కు ఓటేస్తే కేసీఆర్ కు వేసిన‌ట్టే అని, ఆంధ్ర ప్ర‌జ‌ల్ని తిట్టిన చంద్ర‌శేఖ‌ర్‌రావుతో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వంట కాగుతున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చుకోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ డ‌బ్బులు కూడా పంపించార‌ని లేనిపోవి అంట‌గ‌ట్టి ప్ర‌చారంలో జ‌నాల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్నాడు.

కాగా, ఈ విష‌య‌మై తెలంగాణ యువ‌నేత‌, మాజీ మంత్రి కేటీఆర్ చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. మొన్న‌టికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు టీఆర్ ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు త‌హ‌త‌హ‌లాడింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఆ వేళ చంద్ర‌బాబుకు మ‌రి కేసీఆర్ తిట్టిన తిట్లు గుర్తుకు రాలేదా..? మ‌రి అప్పుడు పొత్తుకోసం హైద‌రాబాద్‌లో అంత‌లా తిరగాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందో చెప్పాల‌న్నారు. ఆ వేళ ఎందుకు పొత్త‌కోసం ఉబ‌లాట ప‌డ్డారో త‌న‌కు మాత్రం అర్థం కావ‌డం లేద‌ని చంద్ర‌బాబు ట్వీట్‌ను పేర్కొంటూ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.

ప్ర‌తీ ఎన్నిక‌ల వేళ ఎవ‌రో ఒక‌రితో పొత్తులు పెట్టుకుని గ‌ట్టెక్కే బాబు అలవాటైన విష‌యం తెలిసిందే. పొత్తులు చిత్త‌య్యాక విడిపోయిన పార్టీని నానా దుర్భాష‌లాడే చంద్ర‌బాబు రెండు నాల్క‌ల ధోర‌ణిపై అంద‌రూ అస‌హించుకుంటున్నారు. ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపును ద‌క్కించుకోవాల‌ని కుట్ర‌లు, కుతంత్రాలు ప‌న్నే బాబు ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌ను చేసేది మాత్ర‌మే స‌రైంద‌నుకుంటూ, ఇత‌రులు చేస్తే మాత్రం త‌ప్పులు వెతికే బాబు ఇంత‌గా దిగ‌జారి న‌డుచుకోవ‌డంపై వైసీపీ నేత‌లు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. గెలుపు కోసం అడ్డ‌మైన అర్రులు చాసే బాబు దిగ‌జారుడు రాజ‌కీయాలు చేయ‌డంపై భ‌గ్గుమంటున్నారు. మొత్తంగా బాబుకు కేటీఆర్ పంచ్‌తో ప‌చ్చ‌బాబుకు పొర‌లు తొల‌గిపోయి ఉంటాయి.

చంద్ర‌బాబుకు కేటీఆర్ కౌంట‌ర్‌.. !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share