అదిరిపోయిన `ల‌గ‌డ‌పాటి` సర్వే లాజిక్కు..!

December 8, 2018 at 1:02 pm

తెలంగాణాలో ఎన్నిక‌లు ముగిశాయి. దాదాపు 22 రోజుల ప్ర‌చార ప‌ర్వానికి తెర‌ప‌డ‌డంతో నిన్న వ‌ర‌కు పెద్ద ఎత్తున విమ‌ర్శ లు, మాట‌ల యుద్ధాలు చేసుకున్న మైకులు మూగ‌బోయాయి. ఇక‌, ఈ క్ర‌మంలోనే స‌ర్వేల పేరుతో.. రాష్ట్రం స‌హా దేశంలో వివిధ ప్ర‌సార మాధ్య‌మాలు స‌ర్వేలు నిర్వ‌హించాయి. దాదాపు రెండు నెల‌లుగా నిర్వ‌హించిన స‌ర్వేల తాలూకు సారాంశా న్ని నిక్క‌చ్చిగా బ‌య‌ట‌పెట్టిన జాతీయ మీడియా ఛానెళ్లు.. కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు.. సంఖ్య‌లు, స్థానాల వారీగా కూడా ఎవ‌రి బ‌లం ఎంతో వెల్ల‌డించాయి. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో జాతీయ మీడియా చెప్పుకొచ్చిన ప్ర‌కారం.. టీఆర్ ఎస్ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. వివిధ స‌ర్వేల‌న్నీ కూడా టీఆర్ ఎస్‌కే ప‌ట్టం క‌ట్టాయి.

వాస్త‌వానికి తెలంగాణలో ఓట్లు పోటెత్తాయి. టీఆర్‌ఎస్‌, ప్రజాఫ్రంట్‌ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. మొత్తంగా 73 శాతం పోలింగ్‌ నమోదైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఏకంగా నాలుగు నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌ నగరం, ఇతర పట్టణ నియోజక వర్గాల్లోనే పోలింగ్‌ తగ్గింది. హైదరాబాద్ లో, సొంత ఊళ్లలో రెండో చోట్లా ఓట్లున్న వాళ్లు సొంత ఊళ్లో ఓటేయడానికే మొగ్గు చూపడంతో హైదరాబాద్‌లో పోలింగ్‌ తగ్గిందని భావిస్తున్నారు. ఇతర పట్టణాల్లో పోలింగ్‌ తగ్గడానికి కూడా ఇదే కారణమని అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నిక లతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ భారీగా తగ్గలేదు. రాష్ట్రంలో పోలింగ్‌ ఉత్సాహభరితంగా సాగింది.

కొత్తగా ఓటు వచ్చిన వారి నుంచి పండు వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారు వచ్చి తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. దీంతో పోలింగ్ స‌ర‌ళి మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు మారిపోయాయ‌నేది మేధావుల మాట‌. అయితే, ఏది ఏమైనా తెలంగాణా ప్ర‌జ‌లు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నార‌ని తాజాగా వెల్ల‌డించిన నేష‌న‌ల్ మీడియా ఎగ్జిట్ పోల్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. దీంతో ఒక్క‌సారిగా తెలంగాణాలో దీపావ‌ళి వ‌చ్చిన‌ట్ట‌యింది. అయితే, ఇంత‌లోనే ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ వెల్ల‌డించిన ఎగ్జిట్‌పోల్ తో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. ప్ర‌జాకూట‌మికే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నార‌ని, కేసీఆర్ కి కేవ‌లం 35 స్థానాలే ద‌క్కుతున్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యంతొ ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం గంభీరంగా మారిపోయింది.

నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కూడా చాలా ఉత్సాహంగా ఉన్న టీఆర్ ఎస్ నాయ‌కులు, కేడ‌ర్‌లోనూ ఒక్క‌సారిగా నిరుత్సాహం చోటు చేసుకుంది. అయితే, జాతీయ‌స్థాయిలో మొత్తం మ‌రో 4 చోట్ల ఎన్నిక‌లు నిన్న ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో ప‌రిస్థితుల‌పై కూడా జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్ వెల్ల‌డించాయి. వాటిలో రాజ‌స్థాన్‌లో కాంగ్ర‌స్ వ‌స్తుంద‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప‌రిస్థితి దారుణ‌మ‌నే రిజ‌ల్ట్ వ‌చ్చింది. అవే సంస్థ‌లు తెలంగాణాపైనా రిజ‌ల్ట్ ఇచ్చాయి. అయితే, ఇక్క‌డ ల‌గ‌డ‌పాటి లాజిక్ ఒక‌టి వెలుగు చూసింది. ఇత‌ర రాష్ట్రాల‌పై జాతీయ మీడియా ఇచ్చిన రిపోర్టు ఖ‌చ్చిత‌మేన‌ని ఆయ‌న చెప్పారు. అయితే, తెలంగాణాపై మాత్రం తాను ఇచ్చిందే క‌రెక్ట‌ని అన్నారు. నిజానికి జాతీయ మీడియాలో ఏ ఒక్క‌టీ కూడా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా రాలేదు అయితే, ల‌గ‌డ‌పాటి మాత్రం అధికార పార్టీ ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రాద‌ని చెబుతున్నారు. మ‌రి జాతీయ మీడియాపై ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న న‌మ్మ‌కం.. తెలంగాణాపై లేదా? ఈ లాజిక్కు వెనుక ఏముంది? తెలియాలంటే.. వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

అదిరిపోయిన `ల‌గ‌డ‌పాటి` సర్వే లాజిక్కు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share