మిస్టర్ TJ రివ్యూ

సినిమా : మిస్ట‌ర్‌
TJ రేటింగ్ : 2/5
పంచ్ లైన్ : ‘మిస్టర్ వైట్ల’ మళ్ళీ మిస్సయ్యాడు

నటీనటులు : వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి త‌దిత‌రులు
లిరిక్స్ : కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి
కోడైరెక్ట‌ర్స్ : బుజ్జి, కిర‌ణ్‌
క‌థ : గోపీ మోహ‌న్‌
మాట‌లు : శ్రీధ‌ర్ సీపాన‌
సినిమాటోగ్ర‌ఫీ : కె.వి.గుహ‌న్‌
సంగీతం : మిక్కి జె.మేయ‌ర్‌
నిర్మాత‌లు : న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : శ్రీనువైట్ల‌.

కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి కానీ మన మీద ఎటువంటి ఇంప్రెషన్ కూడా వదిలి వెళ్ళలేవు.నూటికి ఎనభై సినిమాలు ఈ కోవకే చెందుతాయి.ఇక కొన్ని సినిమాలు పులకరింపచేస్తాయి.ఇవి ఓ పది శాతం ఉండొచ్చు..ఇక పోతే ఆఖరివి జలదరింపచేసే సినెమాలన్నమాట.ఇవి ఓ పది శాంత ఉండొచ్చు.మన మిస్టర్ కూడా సరిగ్గా ఇలాంటి జలదరించే సినిమానే.ఎంతలా జలదరిస్తుందంటే చుసిన ప్రేక్షకులకు, తీసిన వాళ్ళకి కూడా ఎంత తొందరగా మరచిపోయి ముందుకెళ్తే ఆరోగ్యానికి అంత మంచిది.

శ్రీను వైట్ల అంటే ఓ స్పెషల్ బ్రాండ్ కం థీమ్ ని తెలుగు సినిమాకు సెట్ చేసిన ఘనత అతని సొంతం.ఎంతలా అంటే ఒకప్పుడు వీళ్ళు కామెడీ హీరోలు..వీళ్ళు మాస్ హీరోలు..వీళ్ళు ఫామిలీ హీరోలు అని టాలీవుడ్ లోని గీతలన్నిటిని చెరిపేసేంతగా.కామెడీ హీరోలకి కాలం చెల్లిపోగా మాస్ హీరోలందరూ కామెడీ బాట పట్టేంతగా.అలా అలా అది కూడా మొహం మొత్తే స్టేజ్ కి చేరిన దశలో ఇక పంథా మార్చేస్తున్న అంటూ మిస్టర్ తో మనముందుకొచ్చాడు.

వున్నదీ పోయే..వుంచుకున్నదీ పోయే అన్నది శ్రీను వైట్లకి సరిగ్గా సరిపోతుంది ఈ టైం లో.తనకి ఎంతో కంఫోర్ట్ జోనర్ జనాలకి బొర్ కొట్టేసేంతగా ఎక్కించాడు.ఇక కొత్త జోనర్స్ ముట్టుకుంటే భగ్గుమనేలా తీస్తున్నాడు.ఇది శ్రీను వైట్ల పరిస్థితి.ఇది వరకే చూసేశామన్న ఫీల్ పక్కన పెడితే కనీసం వైట్ల థీమ్ మూవీస్ అయితే కాస్త కాలక్షేపం అయినా దొరికేది.పంథా మారిస్తే ఆ కనీస కాలక్షేపం కనుమరుగవగా బోనస్ గా కావాల్సినంత కలగాపులగం..అంతులేని వ్యథ.

శ్రీను వైట్ల స్వతహాగా మంచి టెక్నీషియన్ అన్నది అందరు ఒప్పుకునే విషయం.తన సినిమా జర్నీ సక్సెస్ ,ఫెయిల్యూర్స్ రెండింటిలో తన సొంత ప్రతిభాదే మెజారిటీ వాటా.ఒకే జోనర్ సినిమాలు పదే పదే తీయడం వల్ల ఫెయిల్యూర్స్ వచ్చాయేమో కానీ తన సినిమాల్లో క్వాలిటీ తగ్గడంవల్ల కాదన్నది నిర్వివాదాంశం.అద్దె కథలు..అద్దె మాటలు వైట్ల ని తన కంఫోర్ట్ జోన్ నుండి దూరం చేసేస్తున్నాయి.తన బలాబలాలపై ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు ప్లాన్ చేసుకోకపోతే సినీ వైకుంఠపాళి లో వైట్ల పాతాళానికి పడేటందుకు పెద్ద టైం అక్కర్లేదేమో.

అసలు ఈ సినిమా స్టోరీ నే పెద్ద కంగాళీ..కలగూర గంప.తీసుకున్న లైన్ ఏంటి దానికి ఏ మోతాదు బాక్గ్రౌండ్ అయితే అప్ట్ గా ఉంటుందన్నది ఏ సినిమాకయినా కీలకం.అదే ఈ మిస్టర్ కి అతి పెద్ద మైనస్.ఆంధ్ర కర్ణాటక సరిహద్దు..కృష్ణ దేవరాయలు కాలం ఆచారాలు సంప్రదాయాలు,అక్కడి అడవులు,ప్రకృతు అంటూ మంచి ఇంటరెస్టింగ్ గా ఓపెన్ అయిన మిస్టర్ ఆ వెంటనే యూరోప్ కి వెళ్లి అక్కడ హీరో వరుణ్ తేజ్,హీరోయిన్ హెబ్బాపటేల్ ల పరిచయం ఫస్ట్ లవ్ ఇలా ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా వున్నా సెకండ్ హాఫ్ కథ ఇండియాలో ల్యాండ్ అయి ఇంకో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఓ వైపు..ఏ విల్లన్ ఎవరికోసం ఎందుకు ఎటాక్ చేస్తున్నారో తెలీక తలపట్టుకోవాలి.ఇక వాళ్ళ ఒక్కొక్కరి బాక్గ్రౌండ్ పిచ్చి పీక్స్ కి తీసుకెళ్తుంది.ఇక అక్కడినుండి ఆ బాక్గ్రౌండ్స్ అన్నిటిని క్లియర్ చేసి మన హీరో ఎవరి చేయి పట్టాడన్నది కతఅంశం.

క్షమించాలి..చూసింది ఇదీ కథ అని చెప్పడానికే ఇబ్బందిగా వుంది..ఇక చదివి అర్థం చేసుకోవడాన్నికి ఎలా ఉంటుందో నేను వూహించగలను.వరుణ్ తేజ్ కొత్త లుక్ తో ఎనర్జీటిక్ గా బానే వున్నా పెర్ఫఫార్మన్స్ వైస్ కంప్లైంట్స్ లేకున్నా పాటల్లో వరుణ్ ఇంకా ఇబ్బంది పడుతూనే వున్నాడు.హెబ్బా పటేల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.హెబ్బా చుట్టూ రాసుకున్న కథే పడుతూ లేస్తూ ప్రేక్షకుడికి చుక్కలు చూపిస్తుంది.లావణ్య త్రిపాఠి పర్లేదు.విల్లన్స్ దాదాపు టాలీవుడ్ లోని టాప్ రేంజ్ వాళ్ళందరూ వున్నారు.తలోచెయ్యివేసి కథను కంచికి చేర్చారు.బ్రహ్మానందం,ఎం స్ నారాయణలు లేకుండా శ్రీను వైట్ల చేసిన కామెడీ పెద్దగా పేలడం లేదు.రఘబాబు ఊపిరి స్పూఫ్ ఊపిరాడనివ్వదు.ఇక పృద్వి బ్యాచ్ చేసేది కామెడీ అనుకుని నవ్వాలేమో.

ప్రేమని వెతుక్కుంటూ వెళ్తే ఆ ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇదీ అసలు సినిమా థీమ్ లైన్.ఈ కథకి అంత హెవీ వెయిట్ బాక్గ్రౌండ్ ఎందుకో తెలీదు.సినిమా మొదట్లో ఓపెన్ చేసిన కర్ర ఫైట్ క్లైమాక్స్ లో గాని దర్శకుడికి మళ్ళీ గుర్తురాదు.సినిమాలో గుర్తుంచుకోదగింది ఏదయినా ఉంటే అది గుహన్ సినిమాటోగ్రఫీ నే.అంతకు మించి పాటలు,మాటలు,ఫైట్స్ అన్ని అంతంత మాత్రమే.శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే సినిమాకి చెయ్యాల్సిన డామేజ్ అంతా చేసింది.కథ కథనం..దర్శకత్వం సినిమాని కింద పడేసి తొక్కేస్తుంటాయి.

ఏ సినిమాకయినా కథే బలం.కథే హీరో.ఇదీ ఎప్పటినుండో వింటున్న మాట.అయితే మోతాదుకు మించిన కథ,దశా దిశా లేని కథనం కూడా చాలా ప్రమాదం అన్నది మిస్టర్ మాట.