అంబానీ ప్ర‌క‌ట‌న‌తో ప‌రేషాన్‌లో సిని ప‌రిశ్ర‌మ‌…!

August 13, 2019 at 1:21 pm

ప్ర‌పంచ కుభేరుడు, భార‌తదేశ రాజ‌కీయాల‌నే త‌న క‌నుస‌న్న‌ల‌తో శాసించే ముఖేష్ అంబానీ ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌ను త‌న చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ప‌క్కా స్కెచ్ వేశాడా…? దేశీయ టెలికం రంగాన్నే త‌న గుప్పిట్లో పెట్టుకున్న ఈ రిల‌య‌న్స్ ఆధినేత క‌న్ను ఇప్పుడు దేశ సిని ప‌రిశ్ర‌మపై ప‌డిందా…? ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యంతో సిని ప‌రిశ్ర‌మ కుదేలు కావ‌డం ఖాయ‌మ‌నేనా…? అంబానీ ఆలోచ‌న నిజ‌మేనైతే దేశంలోని టెలికం రంగం, సిని రంగం, మీడియా రంగం అంతా అంబాని గుప్పిట్లో బంధీ కావాల్సిందేనా…?

ఇన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం అవున‌నే… ఎందుకంటే రిల‌య‌న్స్ ఆధినేత ముఖేష్ అంబాని తీసుకున్న నిర్ణ‌యంతో ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. ఇంత‌కు ముఖేష్ అంబానీ తీసుకున్న నిర్ణ‌యం ఏంట‌నే క‌దా మీ డౌట్‌… ఓసారి చూద్దాం… రిల‌య‌న్స్ ఆధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు కొత్తగా జియో ఫైబ‌ర్‌తో ముందుకు రాబోతున్నాడు.. ఈ ఫైబ‌ర్‌తో డీటీహెచ్ క‌నెక్ష‌న్‌, టెలిఫోన్ క‌నెక్ష‌న్‌, బ్రాడ్‌బాండ్ క‌నెక్ష‌న్ రానున్నాయి. అంటే ఒకే దెబ్బ‌కు మూడు పిట్ట‌ల‌న్న‌మాట‌.

ఇప్ప‌టికే జియోతో అన్ని టెలికం కంపెనీలు మూత‌ప‌డ్డాయి. ఒక‌టి రెండు త‌ప్పితే జియోకు పోటీనిచ్చే సంస్థ‌లు క‌నుమ‌రుగ‌య్యాయి. ఇప్పుడు జియో ఫైబ‌ర్‌తో అటు డీటీహెచ్ రంగం, ఇటు టెలికం రంగం, మ‌రోవైపు సిని థియోట‌ర్ల రంగం మొత్తం ముఖేష్ అంబానీ చేతుల్లోకి వెళుతుంది. అదే విధంగా అంబానీ ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల‌తో ఇంత‌కాలం థియోట‌ర్ల‌కు వెళ్ళి సినిమాలు చూసి జేబుకు చిల్లు పెట్టుకున్న సామాన్యుడికి మేలు క‌లుగుతుందనేది టాక్‌.

సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచి అన్ని షోలు జియో ఫైబ‌ర్‌తో ఇంట్లోనే చూసుకునే వీలు క‌లుగుతుంది. దీంతో ప్రేక్ష‌కులు థియోట‌ర్ల వైపు క‌న్నేత్తి చూసే ప‌రిస్థితి ఇక ఉండ‌ద‌న్న‌ట్లే.. దీంతో ప్రేక్ష‌కులు సినిమా థియోట‌ర్ల వైపు క‌న్నేత్తి చూడ‌క‌పోతే సినిమాలు చేసే దిక్కులేక థియోట‌ర్లు మూత ప‌డ‌టం ఖాయం. ఇక థియోట‌ర్ల‌నే న‌మ్ముకుని ప్రేక్ష‌కుల‌ను నిలువుదోపిడి చేసే ప‌ప్పు పుట్నాల దుకాణాలు మూసుకోక త‌ప్ప‌దు. దీంతో అంబానీ నిర్ణ‌యంతో థియోట‌ర్ల య‌జ‌మానులు ఇప్పుడు గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. అంబానీ త‌న నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాల‌ని థియోట‌ర్ల య‌జ‌మానులు కోరుకుంటుండ‌గా, సామాన్యులు మాత్రం సంతోషంగా ఉన్నారు. జియో పుణ్య‌మా అని సెల్‌ఫోన్ టారీఫ్ లు త‌గ్గిన‌ట్లే.. ఇప్పుడు నెల‌కోసారి థియోట‌ర్‌కు పోతే పోయే ఖ‌ర్చుతో నెలంతా ఇంట్లోనే అటు సినిమాలు, ఇటు టెలిఫోన్‌, ఇటు నెట్ వాడుకోవ‌చ్చ‌ని ఆనంద‌ప‌డుతున్నారు స‌గ‌టు జ‌నాలు…

అంబానీ ప్ర‌క‌ట‌న‌తో ప‌రేషాన్‌లో సిని ప‌రిశ్ర‌మ‌…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share