జ‌న‌సేన‌లో నాగ‌బాబుకు రెండు ఆప్ష‌న్లు..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ కావ‌డంతో జ‌న‌సేన రాజ‌కీయాలు హీటెక్కాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఇప్ప‌టికే రెండుమూడుసార్లు ఓపెన్‌గానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాగ‌బాబు ఎంపీగా పోటీ చేయ‌వ‌చ్చ‌నే టాక్ ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం కాపు వ‌ర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ నుంచి నాగ‌బాబు జ‌న‌సేన త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఏపీలో రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన కృష్ణా జిల్లా నుంచి నాగ‌బాబు బ‌రిలోకి దిగుతున్నార‌న్న లేటెస్ట్ టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

కృష్ణా జిల్లాలో కాపులు బ‌లంగా ఉన్న మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భ స్థానం నుంచి నాగ‌బాబు ఎంపీగా పోటీ చేసే అంశంపై కూడా జ‌న‌సేన‌లో రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌చిలీప‌ట్నం నుంచి నాగ‌బాబు ఎంపీగా పోటీ చేస్తే కృష్ణా జిల్లాలో జ‌న‌సేన‌కు మంచి ఊపు వ‌స్తుంద‌ని, ఆ ఎఫెక్ట్ మిగిలిన నియోజ‌కవ‌ర్గాల మీద కూడా ప‌డి జన‌సేన‌కు లాభిస్తుంద‌న్న‌దే జ‌న‌సేన అండ్ ప‌వ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.