నాగబాబుకు ఓటు వేయొద్దు..

April 8, 2019 at 10:53 am

నాగబాబుపై శివాజీ రాాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు పీక్ స్థాయికి చేరుకున్న సమయంలో శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగబాబుపై విరుచుకు పడ్డారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు బరిలో నిలిచిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా నాగబాబును ఏకిపారేశారు ఈ సందర్భంగా నాగబాబు వల్ల ‘మా’ ఎలా నష్టపోయిందో.. ఎంతమంది నష్టపోయారో ఆయన వివరించారు. 600 మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయని వాడు నరసాపురానికి ఏం చేస్తారు.. అంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నలు సంధించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి కానీ నాగబాబుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని నరసాపురం ప్రజలను శివాజీరాజా కోరారు.

నాగబాబు వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట దిగజారిపోయిందని.. అభివృద్ధిలోనూ ‘మా’ను ఆయన రెండేళ్లు వెనక్కి నెట్టారని శివాజీ రాజా మండిపడ్డారు. ”నేను ఇలా మాట్లాడడానికి సుమారు పదిహేను రోజులపాటు తీవ్రంగా ఆలోచించాను. పవన్ కళ్యాణ్ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు ఇండస్ట్రీలో అందరూ మెగా ఫ్యామిలీ తో సినిమాలు చేశారు. కానీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజానికి మెగా ఫ్యామిలీ లో లో నాగబాబు ఒక్కటే తేడా ఆయన భీమవరం నాది.. నర్సాపురం నాది.. అని అంటున్నాడు.. అదే ఎలా అవుతుంది. వారంలో మురికివాడలు లేకుండా చేస్తావా? నరసాపురం బాగు చేస్తావా..? నువ్వు నువ్వు వంట గదిలో నుంచి హాల్ లోకి రావడానకే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నువ్వు నరసాపురం వెళ్లి సేవ చేస్తావా?..” అంటూ శివాజీ రాజా నాగబాబును కడిగిపారేశారు ఇదే సమయంలో చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని.. తాను ఎప్పుడూ చిరంజీవికి అభిమానినే అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు ఇక దీనిపై నరసాపురం ప్రజలు ఏమంటారో చూడాలి.

నాగబాబుకు ఓటు వేయొద్దు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share