మంగ‌ళ‌గిరిలో లోకేష్ ఓడుతాడా.. గెలుస్తాడా… నిజానిజాలేంటి..?

May 2, 2019 at 11:57 am

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. లోకేష్‌ను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించేందుకు చంద్రబాబు రెండు సంవత్సరాల పాటు ఎంతో కృషి చేశారు. లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం, త‌మ సొంత జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గాలో పాటు కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం, విశాఖ జిల్లాలోని భీమిలి, విశాఖ నార్త్ నియోజకవర్గాల పేర్లు పరిశీలించారు. ఎట్టకేలకు రాజధాని ప్రాంతం విస్తరించి ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ ఎన్నికల బరిలోకి దిగారు. రాజధాని ప్రాంతం కావడంతో ఈ ఏరియా బాగా అభివృద్ధి చెందింద‌న్న‌ అంచనాలతో లోకేష్‌ను ఇక్క‌డ నుంచి రంగంలో దింపారు.

మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయడంతో సహజంగానే ఈ నియోజకవర్గం స్టేట్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. ఇక్కడ వైసిపి నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఎన్నికల్లో లోకేష్ కోసం టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న పలువురు సీనియర్ నేతలు సైతం మంగళగిరికి వచ్చి మకాం వేసి ప్రచారం చేశారు. లోకేష్ గెలుపు కోసం టిడిపి శ్రేణులు ఎంతగా ప్రచారం చేశాయో లోకేష్‌ను ఓడించేందుకు వైసీపీ శ్రేణులు సైతం అంతే భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఉన్న దశలోనే మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నారంటూ ప్రచారం బయటకు వచ్చింది. పోలింగ్ ముగిశాక సైతం అక్కడ వైసీపీ గెలుస్తుందని వైసిపి వాళ్ళు ధీమాతో ఉన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓటమిపై వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పందేలకు దిగుతున్నారు.

టిడిపి, వైసిపి అంచనాలు ఎలా ఉన్నా మంగళగిరిలో వాస్తవ పరిస్థితి ఏంటి అక్కడ లోకేష్ గెలుస్తారా ? లేదా గత ఎన్నికల్లో 12 ఓట్లతో గెలిచి సంచలనం క్రియేట్ చేసిన రామకృష్ణారెడ్డి మళ్ళీ సంచలనం నమోదు చేస్తారా ? అన్నది పరిశీలిస్తే ఈసారి వైసీపీ గెలుపు అంత సులువు కాదు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి మున్సిపాలిటీ, తాడేపల్లి నగర పంచాయతీనీ మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. మంగళగిరి మున్సిపాలిటీలో బీసీల్లో పద్మశాలి సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించడంలో వీరిదే ప్రధాన పాత్ర. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ సామాజికవర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి ఇదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి సీటు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన గట్టి పోటీ ఇచ్చి కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే అధిష్టానం చిరంజీవిని మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎంపిక చేసింది.

ఈసారి టిడిపి ఇక్కడ బీసీలకు సీటు ఇవ్వలేదని వైసిపి ప్రచారం చేసిన వైసీపీ సైతం రెడ్డి సామాజిక వర్గానికి సీటు ఇవ్వడంతో ఆ ప్రచారం వైసీపీకి పెద్దగా కలిసి రాలేదు. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్థానికంగా ప్రజల సమస్యల పరిష్కారంలో పెద్దగా చొరవ చూపలేదు అనేది ప్రధాన సమస్య ..మళ్లీ ఆర్కె లోకల్ అనేవారు ఉన్నారు . సీఎం చంద్రబాబుతో పాటు, సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో ఆయన చేసిన పోరాటానికి గుర్తింపు లభించింది. ఇక పోలింగ్ సరళి ముగిశాక వైసిపి, టిడిపి ఎవ‌రికి వారే గెలుపు త‌మ‌దే అని లెక్క‌లు వేసుకుంటున్నా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి అనుకూలంగా పోలింగ్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం, సీఎం తనయుడు హోదాలో మంత్రిగా ఉండి ఇక్కడ పోటీ చేయడంతో చాలా మంది ఇది లోకేష్‌కు ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని టిడిపికి ఓటు వేసినట్టు స్పష్టమవుతోంది.

మంగళగిరి రూరల్, దుగ్గిరాల మండలాల్లో టీడీపీకి మంచి మెజారిటీ రానుంది పబ్లిక్ పల్స్ ద్వారా అని తెలుస్తుంది. తాడేపల్లి నగర పంచాయతీ, తాడేపల్లి మండలాల్లో వైసీపీ భారీ మెజార్టీ వస్తుందని లెక్కలు వేసుకుంటోంది.తాడేపల్లి ప్రాంతం వైసీపీకి మంచి పట్టున్నా ఈసారి అక్కడ ఓట్లు సరిసమానం అవ్వడం లేదా వైసిపికి స్వల్ప ఎడ్జ్ ఉండటం కానీ జరగనుంది. ఇక నియోజకవర్గ కేంద్రమైన మంగళగిరి మునిసిపాలిటీలో టిడిపికి మెజార్టీ రానుంది తెలుస్తుంది. మున్సిపాలిటీలో టీడీపీ మెజార్టీనీ అంచనాలకు మించి వస్తే లోకేష్‌కు 15 వేల పైచిలుకు మెజారిటీ వస్తుంది లేనిపక్షంలో స్వల్ప మెజారిటీతో అయినా లోకేష్ గెలిచేందుకే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయి టీడీపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నారు . ఏదైనా ఫలితం కోసం మే 23 వరకు ఎదురుచూడాల్సిందే .

మంగ‌ళ‌గిరిలో లోకేష్ ఓడుతాడా.. గెలుస్తాడా… నిజానిజాలేంటి..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share