ప్ర‌చారం ఎక్కువ‌.. ప‌ని త‌క్కువ‌.. చినబాబు స్టైల్ డిఫ‌రెంట్‌

November 5, 2018 at 10:57 am

`ఏపీలో ప్ర‌చార ప్ర‌భుత్వం ఉంద‌`ని ఇటీవ‌ల బిహార్ సీఎం నితీష్ కుమార్ యాద‌వ్ అన్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఈ విష‌యంలో ఆయ‌న ఎందుకు ఆయ‌న అలా రియాక్ట్ అయ్యారో తెలియ‌దు. వాస్త‌వానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పుకునే వ్యాఖ్య‌లుమాత్రం దేశంలో ఎక్క‌డా త‌న ప‌నితీరుకు వంక‌పెట్టే వారే లేర‌ని! ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. ఏ వేదిక ఎక్కినా చె ప్పుకొనే మాట ఇదే! అయితే, వాస్త‌వానికి ఈ ప‌రిస్థితి లేద‌ని రాష్ట్రంలో అభివృద్ధిపై అద్య‌య‌నం చేస్తున్న‌వారు ఎవ‌రైనా చె బుతారు. కొన్ని విష‌యాల్లో వెనుక‌బ‌డి ఉండొచ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ చెప్పే మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత‌న లేకుం డా పోతోంది. 45121062_1791458387619670_939042359583178752_n

ఏపీని పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తాన‌ని చంద్ర‌బాబు చెబుతూ వ‌స్తున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న యు డు, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా పెట్టుబ‌డులు విప‌రీతంగా వ‌స్తున్నాయ‌ని, ముఖ్యంగా ఐటీ రంగంలో పెడ్డుబడుల వ రద పారుతోంద‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. ఇక‌, వీటిని త‌మ‌కు అనుకూల ప‌త్రిక‌లు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకునేందుకు వారు ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. స‌రే! మ‌రి వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యాన్ని ప‌రిశీ లిస్తే.. దీనికి భిన్నంగా ఉంద‌నే చెప్పాలి. నిజానికి ఏపీ వంటి విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి వంద‌లు, వేల కోట్లు వ‌స్తా యని ఊహించ‌డం క‌ష్ట‌మే. వ‌న‌రులు ఉన్నా.. ఆదాయం లేని రాష్ట్రం కావ‌డంతో పెట్టుబ‌డులు అంత త్వ‌ర‌గా వ‌స్తాయ‌ని ఎవ‌రూ భావించ‌రు.45073587_1792381654194010_7902839729874272256_n

అయితే, ఏపీ క‌న్ను తెరిచిన వెంట‌నే ప‌రుగులు పెడుతోంద‌నే రీతిలో అటు చంద్ర‌బాబు, ఇటు చిన‌బాబు చేస్తున్న హ డా వుడి అంతా ఇంతా కాదు. ఏపీలో ఐటి రంగం అభివృద్ధికి చెమటోడ్చుతున్నాం. దేశాల చుట్టూ తిరిగి కంపెనీలు తె స్తున్నాం. ఇప్పటికే 25 వేల వరకూ ఉద్యోగాలు కల్పించాం అని మంత్రి చిన‌బాబు పదే ప్రకటనలు చేస్తున్నారు. ఐటి రంగం ప్రమోషన్ పేరుతో సర్కారు సొమ్మును మాత్రం వందల కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. పోనీ ఆ రేంజ్ లో కంపెనీలు ఏమైనా ఏపీకి తెస్తున్నారా? అంటే అదీ లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ ఐటీ శాఖ చేసుకున్న అవగాహన ఒప్పందాలు మొత్తం 220.

వీటి తాలూకు అందుకున్న పెట్టుబడి మాత్రం 744 కోట్ల రూపాయలు మాత్రమే. ఐటి శాఖతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు ఇప్పటివరకూ కల్పించిన ఉద్యోగాల సంఖ్య కేవలం 6997 మాత్రమే. కానీ, చిన‌బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వాస్త‌మో.. ఆయ‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ గొప్ప‌లకు ఓట్లు ప‌డ‌తాయ‌ని భావిస్తున్న వీరికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ప్ర‌చారం ఎక్కువ‌.. ప‌ని త‌క్కువ‌.. చినబాబు స్టైల్ డిఫ‌రెంట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share