బ్రేకింగ్ సర్వే : లోకేష్ ఓటమి ఖాయం..!

May 20, 2019 at 3:26 pm

చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఓట‌మి ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్ అంచ‌నాలు తేల్చేస్తున్న‌ట్లు స‌మాచారం. టీడీపీ ఓడిపోయే స్థానాల్లో మంగ‌ళ‌గిరి కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. కొద్ది సంవ‌త్స‌రాలుగా ఖ‌చ్చిత‌మైన ఎగ్జిట్ పోల్స్ రిజ‌ల్ట్స్‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న ఆరా పోల్స్ స్ట్రాటజీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ విష‌యం ఆఫ్ ది రికార్డులో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. మంగళగిరి బరిలో ఉన్న లోకేశ్ గెలుపు సందేహమేనని అస‌లు విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది. కుల సమీకరణాలు.. బాబు పాలనతో పాటు.. లోకేశ్ వ్యక్తిగత వైఫ‌ల్యం… విచిత్ర‌మైన మ్యాన‌రిజం.. అస్ప‌ష్ట‌త‌.. కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న వేళ.. ఆరా ఎగ్జిట్ పోల్స్ ఆయన ఓటమి తప్పదన్న అంచనాను వినిపించటం గమనార్హం.

ఆరా సంస్థ చెప్పే అంచనాలు చాలా వరకూ నిజమయ్యాయి. అన్నింటికి మించిన ఊహించని విధంగా విజయాలు సొంతం చేసుకున్న ప్రతిసారీ.. ఈ సంస్థ తన అంచనాల్ని తూచా తప్పకుండా చెప్పటం.. ఓటింగ్ సరళిని పసిగట్టటంలో మంచి పేరుంది.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ విజయఢంకా మోగిస్తుందన్న మాటను అందరి కంటే బలంగా చెప్పారు. అప్పట్లో ఆ మాటల్ని మిగిలిన వారు పట్టించుకోలేదు. కానీ.. చివ‌రికి ఆరా చెప్పిందే నిజ‌మైంది. 2008 నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్న సంస్థ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. 2014లో విభజన కారణంగా బాబు చేతికి అధికారాన్ని ఇచ్చారని.. పవన్ తో కలిసి పోటీ చేయటం లాభించినట్లుగా తమ ఎగ్జిట్ ఫలితాల విడుదల సందర్భంగా సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఇక ప్ర‌స్తుత ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే తెలంగాణలో టీఆర్ ఎస్ గెలుపు పక్కా అని తేల్చిన సంస్థ.. ఏపీలో జగన్ విజయం సాధించటం తథ్యమంది. అందరి అంచనాలకు తగ్గట్లే జగన్ క్లియర్ కట్ మెజార్టీతో విజయాన్ని సాధిస్తారని.. తాజా ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఇబ్బందికరంగా ఉంటాయన్న విషయాన్ని తేల్చింది. అయితే ఏపీలో ఓటింగ్ తో పాటు.. కులాల ప్రాతిపదికన కూడా సర్వే చేసిన ఈ సంస్థ.. ఏపీలో జగన్ విజయం ఖాయమని పేర్కొంది. ఆరా సంస్థ‌తో పాటు ఇత‌ర జాతీయ సంస్థ‌లు కూడా ఇదే విష‌యాన్ని చెప్పాయి.

బ్రేకింగ్ సర్వే : లోకేష్ ఓటమి ఖాయం..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share