నాని కారుకు యాక్సిడెంట్…గాయాలు..!

January 26, 2018 at 4:06 pm

నేచుర‌ల్ స్టార్‌, వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్ హీరో నాని కారుకు యాక్సిడెంట్ అయ్యింద‌ని తెలుస్తోంది. నాని కారులో ప్ర‌యాణిస్తుండ‌గా జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 45లో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం. నాని కారు డ్రైవ‌ర్ వాహ‌నం న‌డుపుతూ నిద్ర‌లోకి జారుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో నాని ముక్కుకు, రెండు ప‌ళ్ల‌కు, ముఖానికి గాయాలు అయిన‌ట్టు ఇండ‌స్ట్రీలో కొంద‌రి ద్వారా మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం నాని హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆసుప‌త్రితో పాటు నాని ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యం మాత్రం బ‌య‌ట‌కు పొక్క‌లేదు. ఇక ఈ గాయాలు మిన‌హా నాని ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉందంటున్నారు. నాని వ‌ర‌సుగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

గతేడాది కూడా మూడు హిట్లు ఇచ్చాడు. చివ‌ర్లో ఎంసీఏ లాంటి యావ‌రేజ్ కంటెంట్‌తో కూడా సూప‌ర్ హిట్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం నాని న‌టిస్తోన్న కృష్ణార్జున యుద్ధం మార్చిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. గత ఏడాది మూడు హిట్ లు ఇచ్చిన నాని, ఈ ఏడాది కూడా మరో మూడు సినిమాలు అందించే దిశగా షూటింగ్ లు చేస్తున్నాడు.ఇక నానికి యాక్సిడెంట్ విష‌యంపై నిజానిజాలు పూర్తిగా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. 

 

నాని కారుకు యాక్సిడెంట్…గాయాలు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share