నేను లోకల్ TJ రివ్యూ

సినిమా : నేను లోక‌ల్
రేటింగ్ : 3/5
పంచ్ లైన్ : సినిమా కూడా లోకలే

నటీనటులు : నాని, కీర్తిసురేష్, న‌వీన్ చంద్ర, పోసాని కృష్ణ మొరళి, సచిన్ ఖేడేకర్, ప్రభాస్ శ్రీను.
మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ
రచన : సాయి కృష్ణ
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ
సమర్పణ : దిల్ రాజు
నిర్మాత : శిరీష్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – త్రినాథ రావు నక్కిన

సుడి ముందు సునామి కూడా సున్నితంగా తప్పుకోవాల్సిందే..స్వింగ్ ముందు సబ్జక్ట్స్ అన్ని సలాం కొట్టాల్సిందే…ఇదంతా ఎందుకంటారా…దిల్ రాజు సుడి..నాని స్వింగ్ ఈ రెండు కలిస్తే ఎంత మూస కథయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే మరి.అసలే నాని అంటే బాబులకు బాబు అయి కూర్చున్నాడు..చేసిందల్లా హిట్టే..అవేరేజ్ సినిమాల్ని నాని అమాంతం సోలోగా హిట్ సినిమాలుగా చేసేస్తున్నాడు.

ఇక ఈ స్వింగ్ కి దిల్ రాజు మాస్టర్ మైండ్ సుడి కలిస్తే వేరే చెప్పాలా..సింపుల్ గా అది నేను లోకల్..ఇదేదో ఆకాశం నుండి ఊడిపడ్డ కథ కాదు..కథనం అంతకంటే కాదు..అలాగని రెగ్యులర్ సినిమాలతో విసిగిపోతున్న ప్రేక్షకులకి ఓదార్పు అంతకంటే కాదు.ఇది ఓ సగటు సినిమా..ఎలాంటి సినిమా అంటే..దిల్ రాజు సినిమా అనగానే ఎలాంటి జాగ్రత్తలుంటాయో…నాని సినిమా అనగానే ఎలాంటి వినోదం ఉంటుందో రెండిటినీ కలిపి మిక్సీ లో వేస్తే వచ్చే అవుట్ ఫుట్ నేను లోకల్.

దిల్ రాజు సినిమా అనగానే స్క్రిప్ట్ ఆద్యంతం ఒక లెక్కుంటుంది..ఇక్కడ పాటుండాలి..అక్కడ ఫైట్ ఉండాలి..ఫస్ట్ హాఫ్ ఫన్నీ గా ఉండాలి.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉండాలి..సెకండ్ హాఫ్ ఎమోషన్ ఉండాలి..ప్రీ క్లైమాక్ పంచ్ ఉండాలి..క్లైమాక్స్ బొమ్మరిల్లుకి మించివుండాలి..ఇదీ ఇప్పట్లో దిల్ రాజు సినిమా లెక్క..అవన్నీ అతికినట్టు సరిపోయాయి నేను లోకల్ కి.ఈ లెక్కకి నాని కిక్ ఇచ్చాడు.

మార్చ్.. సెప్టెంబర్ దండయాత్రలతో ఇంజనీరింగ్ పాసవ్వడానికి బాబుగాడు(నాని) పడే తంటాలతో మొదలయ్యే సినిమా తొలి చూపులోనే దీప్తి(కీర్తి సురేష్) తో ప్రేమలో పడటం..తండ్రి నమ్మకానికి నిలువెత్తు రూపంలా పెరిగిన దీప్తి ని బాబు గాడు ప్రేమలో ఎలా పడేసాడు..ఈ ప్రేమ జంటకి ఎదురయ్యే కష్టాలేంటన్నదే కతాంశం.

జులాయిగా తిరిగే కుర్రాడు..అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు..ఈ ఇద్దరి మధ్య ప్రేమ..బాధ్యత తెలీని సంపాదన లేని కుర్రాడితో పెళ్ళికి ఆ ఆతండ్రి ఒప్పుకోక పోవడం..ఈ కతాంశం పైన లెక్కలేనన్ని సినిమాలు వచ్చేసాయి..వస్తూనే వున్నాయి..నువ్వే నువ్వే సినిమాతో ఈ కథలో డెప్త్ అంతా తోడేశాడు త్రివిక్రమ్..ఇంకా ఈ కథని వాడుతూనే వున్నారు పాపం.ఇలాంటి కథకి కూడా ఎంతో కొంత ఫ్రెష్ నెస్ వచ్చిందంటే అది నాని వల్లనే.

నాని టైమింగ్ లో నవతరం నటులెవ్వరూ సాటిరారు.నాచురల్ స్టార్ కి కేర్ ఆఫ్ అడ్రస్ నానియే.కామెడీ టైమింగ్..ఎమోషనల్ సీన్స్..ఇవన్నీ కామన్ అయితే ఈ సినిమాలో డాన్స్ కూడా మంచి మూవెమెంట్స్ చేయగలనని చూపించాడు నాని.హీరోయిన్ కీర్తి అందం అభినయంతో ఆకట్టుకుంది..ఇక అందాల రాక్షసి ఫెమ్ నవీన్ చంద్ర సరికొత్త గెట్ అప్ లో మెరిశాడు.మిగిలిన వాళ్లలో సచిన్ కేల్కర్ ఛాయస్ అంత యాప్ట్ కాదు.తెలుగు నేటివిటీ కి సచిన్ అంతగా సెట్ అవ్వలేదు.పోసాని,ప్రభాస్ శీను,రావు రమేష్ తదితరులు పర్లేదనిపించారు.

ఇలాంటి రొటీన్ కథలకి స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండాలి,చాలా మటుకు స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్ గా నడుస్తుంది.దర్శకుడు త్రినాథ రావు త్రివిక్రమ్ సినిమాలని అక్కడక్కడా బాగానే వాడాడు.s / o సత్యమూర్తి సినిమా ఓపెన్ చేసిన విధానమే చావుకి ముందు హీరో జరిగిన గతాన్ని చెప్పడం నేను లోకల్ కి కూడా వాడేసాడు.పోలీస్ స్టేషన్ సీన్ అంత కన్విన్సింగ్ గా లేదు.రావు రమేష్ ని కథలో జొప్పించినప్పుడే ఈయన మళ్ళీ క్లైమాక్స్ లో కనిపిస్తాడని అర్థం అయిపోతుంది.హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమలో ప్రాబ్లెమ్ అనగానే ఇక దాన్ని మన హీరోనే సాల్వ్ చేసేస్తాడని తెలిసిపోతుంది.ఇలాంటి స్క్రీన్ ప్లే పొరపాట్లు చాలానే కనిపిస్తాయి.సినిమాకి పాటలు పెద్ద రెఫ్రెష్మెంట్..దేవి మంచి ట్యూన్స్ ఇచ్చాడు..వాటికి అంతే మంచి లొకేషన్స్ హీరో హీరోయిన్స్ కోరియోగ్రఫీ తోడయ్యాయి.సినిమాటోగ్రఫీ బాగుంది.మాటలు పంచ్ డైలాగ్స్ లా కాకపోయినా నాచురల్ గా బాగున్నాయి.నాన్నంటే రోజు రాత్రి పూట రాసుకునే డైరీ లాంటివి.

ఓవర్ అల్ గా నేను లోకల్ ఎవర్ని డిసప్పోఇంట్ చెయ్యదు ఒక్క రొటీన్ సినిమా అని ఫీల్ అయ్యే వాళ్ళని తప్ప.ఎంటర్టైన్మెంట్,ఎమోషన్,లవ్,ఫామిలీ ఎవరికేది కావాలో అది తీసుకోవచ్చు.కానీ కొత్తదనం మాత్రం ఏక్సపెక్ట్ చెయ్యకండి ప్లీజ్.