NTR రంజాన్ బంపర్ గిఫ్ట్ అదే!

పండుగ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ కు ఏదో ఒక ట్రీట్ ఇచ్చేందుకు స్టార్ హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక అభిమానులంటే ప్రాణంగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్న రంజాన్ పండుగ నాడు అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్లో జూనియర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ టీజర్ తో రంజాన్ బంపర్ గిఫ్ట్ ఇస్తున్నాడు.

టెంపర్, నాన్నకు ప్రేమతోల సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ చేస్తున్న జనతా గ్యారేజ్ మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అదీగాక కొరటాల శివ దర్శకత్వంలో అనేసరికి ఇక సినిమాకు తిరుగుండదు అనేస్తున్నారు. ఇక సినిమాకు మరింత క్రేజ్ వచ్చేందుకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో నటిస్తున్నారు. ఇన్ని హంగులతో వస్తున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఇక కొరటాల శివకు రెండు సినిమాలకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ గ్యారేజ్ కు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు.రంజాన్ నాడు టీజర్ రిలీజ్ చేసేందుకు అంతా సెట్ చేశారు. మరి ఫస్ట్ లుక్ తోనే అరుపులు పుట్టించిన జూనియర్ ఈ టీజర్ తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇప్పటికే షూటింగ్ టైంలో చిత్రయూనిట్ సినిమా అవుట్ పుట్ పట్ల సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో జనతా గ్యారేజ్ పట్ల అంచనాలు తారా స్థాయిలో చేరుకున్నాయి. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఆగష్టు 12 దాకా వెయిట్ చేయాల్సిందే.