ప‌త‌నం దిశ‌గా ప‌తంజ‌లి!

September 10, 2019 at 10:18 am

దేశీయ మార్కెట్ దిగ్గ‌జం బాబారాందేవ్ ప‌తంజ‌లి మార్కెట్ క్ర‌మంగా ప‌త‌న‌మ‌వుతోందా.. ఆయుర్వేద ఉ త్పత్తుల సేల్స్ రోజురోజుకూ త‌గ్గిపో తున్నాయా… అంటే ప్ర‌పంచ వినియోగ‌దారుల అధ్య‌య‌న సంస్థ కంటార్ వాల్డ్ ప్యానెల్ అవున‌నే అంటోంది. స‌రైన ప్ర‌ణాళిక లేకుండా విస్త‌ర‌ణ చేప‌ట్ట‌డం, అమ్మ‌కాల‌కు సరైన ప‌ద్ధ‌తి లేక‌పోవ‌డం, ప‌టిష్ట‌మైన స‌ప్ల‌య్ వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం, ప్రొడ‌క్ట్‌లో నాణ్య‌త, రాంగ్ బిజినెస్ మోడ‌ల్ ఫాలో అవడం లాంటి కార‌ణాలు ప‌తంజ‌లి ఉత్ప‌త్తులు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల కేట‌గిరీలో హిందూస్తాన్ లీవ‌ర్ మొద‌టి ప్లేస్‌లో ఉంటే…పతంజ‌లి రెండో స్థానాన్ని ఆక్ర‌మించింది. 2016-17 సంవ‌త్సరంలో ప‌తంజ‌లి ఆదాయం ప‌దివేల కోట్లు . ఆ త‌ర్వాత ఏడాది 20 వేల కోట్ల‌కు ఆదాయం చేరుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. అయితే 2017-18లో కేవ‌లం 8100 కోట్ల ఆదాయాన్ని మాత్ర‌మే ప‌తంజ‌లి ఆర్జించింది. 2018-19లో తొమ్మిది నెల‌ల ఆదాయం 4700 కోట్ల‌కు ప‌డిపోయింది.

ఇక మూడు నెల‌లు మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో గ‌త ఏడాది కంటే ప‌తంజ‌లి ఆదాయం భారీగా త‌గ్గింద‌ని స‌మాచారం. 2009లో ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేశారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల కేట‌గిరీలో స్వదేశీ బ్రాండ్‌తో పతంజ‌లి అడుగుపెట్టింది. ఐదేళ్ల‌లోనే రెండో స్థానానికి చేరింది. గ‌త ఏడాదితో పోలిస్తే ఇప్ప‌టికే ప‌ట్ట‌ణ మార్కెట్‌లో ప‌తంజ‌లి ఉత్ప‌త్తులు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌పంచ వినియోగ‌దారుల అధ్య‌య‌న సంస్థ కంటార్ వాల్డ్ ప్యానెల్ త‌న నివేదిక‌లో పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాల్లో ప‌తంజ‌లి మూడో స్థానానికి ప‌డిపోయింద‌ని సంస్థ తెలిపింది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల విభాగంలో కూడా ప‌తంజ‌లి హ‌వా మొన్న‌టివ‌ర‌కూ న‌డిచింది. యాడ్ ఎక్స్ ఇండియా నివేదిక ప్ర‌కారం 2016లో ఎల‌క్ట్రానిక్‌, ప్రింట్ మీడియా, రేడియోకు యాడ్స్ ఇచ్చిన కంపెనీల్లో ప‌తంజ‌లి మూడో స్థానంలో నిలిచింది. 2018లో 11 వ ప్లేస్‌, 2019లో 40వ ర్యాంకుకు ప‌డిపోయింది.

మ‌రో వైపు గ‌త తొమ్మిది నెల‌ల కాలంలో ప‌తంజ‌లి నుంచి ఒక్క కొత్త ప్రొడ‌క్ట్ కూడా రాలేదు. గ‌తంలో హైప్ క్రియేట్ చేసిన బేబి ప్రొడ‌క్ట్స్ అమ్మ‌కాలు కూడా నిలిచిపోయాయి. ఢిల్లీ మార్కెట్‌లో బేబి ప్రొడ‌క్ట్స్ కనిపించ‌డం లేదు. మూడు నెల‌ల నుంచి ఆన్‌లైన్‌లో కూడా ఈ ఉత్ప‌త్తులు క‌నిపించ‌డం లేదు.
ప‌తంజలి రిటైల్ షాపు ఓన‌ర్లు కూడా ఒక్కొక్క‌రు షాపులు మూసివేస్తున్నారు.

ప‌త‌నం దిశ‌గా ప‌తంజ‌లి!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share