పవన్ కళ్యాణ్ కు ఆ ధైర్యం ఉందట…

November 24, 2018 at 8:06 pm

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తాను నిజాయితీ గా ధైర్యంగా రాజకీయాలు చేస్తున్నాని, ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా ప్రజా సమస్యల పై ఎంతటి వారినైనా నిలదీయ గలిగిన ధైర్యం తనకు ఉందని చెపుతున్నారు. నిజానికి మాటల్లో రెండురాష్ట్రాల్లో ఎక్కడైనా మాట్లాడే
దైర్యం ఉందని అంటున్నారే తప్ప.. ఆచరణలో ఆ ధైర్యాన్ని పవన్ చూపించలేకపోతున్నారు. ఏపీలో చంద్రవైఫల్యాలను బాగానే ఎండగడుతున్నా.. తెలంగాణకు సంబంధించి.. అసమర్థపు మౌనం పాటిస్తున్నారు.46703911_720841071648504_5426088753498161152_n

ఇప్పుడు తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నందున ఆ రాష్ట్రానికి సంబంధించి పవన్ చూపిస్తున్న ధైర్యం గురించి చెప్పుకుందాం. ఏపీ కంటే తెలంగాణ లోనే తనకు అభిమానులు ఎక్కువని, తనకు తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలు అన్నా చాలా అభిమానం అని పవన్ కళ్యాణ అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. తన సినిమాలకు సర్కార్, సీడెడ్ ల కంటే, నైజామ్ లోనే కలెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయని కూడా పవన్ చెపుతుంటారు. తెలంగాణ ప్రజలు చాలా మంచి వారని, ఆంధ్ర పాలకుల తీరు వల్లే వారు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని, ఆ ఉద్యమ ప్రభావం తనపై చాలా ఉందని ఆయన తన అభిమానులకు, ప్రజలకు గుర్తు చేస్తుంటారు.PK

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల సమస్యల పై ప్రశ్నించేందుకే తాను జనసేన పార్టీ, పెట్టానని పవన్ అంటుంటారు. ఇందు కోసం తాను ఎవ్వరి నైనా ధైర్యంగా ప్రశ్నించ గలనంటున్న పవన్, మరి తెలంగాణ ఎన్నికలలో ఎందుకు తన పార్టీ జనసేన ను పోటీ లో ఉంచలేదో ప్రజలకు తెలియ జేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయలేక పోవడానికి కుంటి సాకులు చెపుతున్న పవన్ కళ్యాణ్, నిజంగా తాను అనేక సార్లు చెప్పినట్లు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే, తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగి ఉండాలి. తన పార్టీ తరఫున ప్రజలకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేసి ఉండాలి.What-For-Pawan-Met-KCR-in-Pragathi-Bhavan--1514825038-1754

ముందస్తు కావడం వల్ల బరిలోకి దిగలేదు.. ‘ప్రిపేర్డ్’ గా లేను అంటూ సాకులు చెప్పి పవన్ పోటీనుంచి తప్పుకున్నారు. మరైతే.. ఆయన ఎరికలో మంచివాళ్లయిన ఎవరో ఒకరికి మద్దతు పలకడానికి ఏమైంది. ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న నాయకులలో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు చిత్త శుద్దితో ప్రయత్నించే వారికి కనీసం తన మద్దతు తెలియ జేసి ఉండాల్సింది. తనకు స్నేహితులైన చాలా మంచి వాళ్లు తెలంగాణలో చాలా లమంది ఉన్నారని పవన్ గతంలో చాలాసార్లు చెప్పుకున్నారు. ఇప్పుడే రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వచ్చిన ప్రతి అవకాశం ను వినియోగించుకొని ఎన్నికలలో పోటీ చేసి, ప్రజా మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి తప్ప, తనకు అలవాటైన సినిమాటిక్ డైలాగులతో , చేతలలో లేని హీరోయిజం ప్రదర్శించాలనుకుంటే ప్రజలలో అభాసు పాలు అయ్యే అవకాశాలే ఎక్కువ.

పవన్ కళ్యాణ్ కు ఆ ధైర్యం ఉందట…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share