పవన్ ను నమ్ముకుంటే మునుగుతాం!

November 11, 2018 at 9:50 am

పవన్ కల్యాణ్ ను తెలంగాణలో రాజకీయం చేయాలనుకున్న కొందరు ఔత్సాహికులు ఇప్పుడు కుమిలి కునారిల్లిపోతున్నారు. ఆయనను నమ్మకుంటే మునిగినట్టే అని ఫిక్సవుతున్నారు. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలు తప్ప తెలంగాణ గురించి పట్టించుకోకపోవడం, ఇక్కడ కూడా కేసీఆర్ భజన చేస్తుండడం.. ఇన్నాళ్లూ ఆయన కోటరీలో ఉన్న వారికే బాధ కలిగిస్తోంది. కనీసం స్వతంత్రంగా బరిలోకి దిగి ఓడిపోయినా సరే.. భవిష్యత్తుకు రాజకీయ మనుగడ ఉంటుందని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.maxresdefault

తెలంగాణ అంటే తనకు ఎనలేని అభిమానం అని, తెలంగాణ ఎన్నికలలో జనసేన పార్టీ తప్పక పోటీ చేస్తుందని ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్నికలలో పోటీ పై చేతులెత్తేశారు. తెలంగాణ లో ముందస్తుగా ఎన్నికలు రావడంతో, తాము ఎన్నికలకు సరిగా సన్నద్దం కాలేక పోయామని, లేకుంటే, 2019 లో జనసేన పార్టీ 23 అసెంబ్లీ సీట్లకు, 3 ఎంపీ సీట్లకు పోటీ చేయాలని అనుకున్నామని చెపుతున్నారు. ఇదంతా ‘లేస్తే మనిషిని కాను..’ అని బీరాలు పలికే కుంటివాడి సామెత లాగానే ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.Pawan-Kalyans-Janasena-Par

ఇటీవల కాలంలో తెలంగాణ లో కెసిఆర్ పరిపాలన చాలా బాగుందని పొగడుతున్న పవన్ కెసిఆర్ తో కుమ్మక్కై, తెలంగాణ లో ఖచ్చితంగా పోటీ చేయాలని ఆయన అభిమానుల నుంచి ఒత్తిడి వస్తున్నా వెనుకడుగు వేస్తున్నారని, మరోవైపు పవన్ ను కేటీఆర్ కీర్తిస్తున్నారని, కెసిఆర్, బిజెపి, పవన్ లు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.45545895_710542649345013_2509811044755439616_n

2014 ఎన్నికలలో జనసేన పార్టీ మద్దతు తో ప్రభుత్వాలు ఏర్పడ్డాయనే పవన్, 2018 లో వచ్చిన తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ఎందుకు సిద్దం కాలేక పోయారో ఆయనకే తెలియాలి. ఇప్పుడు జనసేన తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం కష్టమని, స్వతంత్రులు కొందరు తమ మద్దతు కోరుతున్నారని, ఆ విషయం పై త్వరలోనే తన నిర్ణయం తెలియ చేస్తానని పవన్ చెపుతున్నారు. 2014 కు ముందే పార్టీ పెట్టినా, తెలంగాణ లో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయి రెండు నెలలు అవుతున్నా జనసేన పోటీలో లేకపోవడం ఆయన అభిమానులను నిరాశ కు గురి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన కు చాలా మద్దతు ఉందని, తెలంగాణ లోకూడా ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని పవన్ చెప్పిన మాటలు, ఇప్పుడు తెలంగాణ లో పోటీ పై పవన్ తీసుకుంటున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితం పై ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ పై దాగుడుముతలు ఆడకుండా, తన అభిమానులను, జనసేన మద్దతు దారులను నిరాశలో ముంచకుండా, జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.

పవన్ ను నమ్ముకుంటే మునుగుతాం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share