పవన్ ఇలా అయితే నీ పరువు గంగ పాలే

December 3, 2018 at 4:52 pm

ప‌చ్చ కామెర్లోడికి లోక‌మంతా ప‌చ్చ‌గా క‌నిపిస్తుంద‌న్న‌ట్లుగా…జ‌గ‌న్ చేసే ప్ర‌తి ప‌ని ప‌వ‌న్‌కు త‌ప్పుగానే తోస్తోంది..పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారిని ఆప్యాయంగా ప‌లుక‌రిస్తుంటే….దానిని ప‌వ‌న్ త‌ప్పుడు ద‌`ష్టితో చూస్తూ.. బుగ్గ‌లు గిల్లుతూ..చెంప‌లు నిమురుతూ జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ల‌కుండా పాద‌యాత్ర‌ల పేరుతో టైం పాస్ చేస్తున్నార‌ని కామెంట్ చేశాడు. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన రైతు క‌వాతులోను అదే వ్యాఖ్య‌ల‌ను రిపీట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలోని అభిమానులు, కార్య‌క‌ర్త‌లే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారని స‌మాచారం. రాజ‌కీయ ప‌రిప‌క్వ‌తే కాదు..క‌నీస ఇంగిత జ్ఞానం ఉన్న వ్య‌క్తిలా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని కొంత‌మంది సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు చెప్పుకుంటున్నారు.47281213_725782414487703_6103807830865739776_n

రాజ‌కీయాల‌పై కించిత్ కూడా అవ‌గాహ‌న లేకుండా కేవ‌లం సినిమా డైలాగులు కొడుతూ జ‌నంలో తిరుగుతూ…రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని ఇప్ప‌టికే విప‌క్షాల నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల వైసీపీ నాయ‌కురాలు ఎమ్మెల్యే రోజా.. ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. `ముందు నీవు మూడు పెళ్లిల్లు ఎందుకు చేసుకున్నావో చెప్పు` అంటూ నిల‌దీశారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న స్పందించ‌లేదు. గురివింద గింజ‌లా వ్య‌వ‌హ‌రించ‌డం ఆయ‌న‌కే చెల్లుతోంద‌నే విమ‌ర్శ‌లు ప‌వ‌న్‌పై ఉన్నాయి. గాలికి పోయే కంప‌ను…ఏమో చేసిన‌ట్లుగా ప‌వ‌న్ తీరు ఉంద‌ని రాజ‌కీయ పండితులు పేర్కొంటున్నార‌ట‌.

నిజంగా ప్ర‌జా సేవ చేయాల‌ని ఉంటే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు…ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటిపై పోరాడాలని జ‌నం సూచిస్తున్నారు. అంతేకాని ఇలా ప‌నికి మాలిన విమ‌ర్శ‌లు చేసి ఉన్న ప‌రువును పోగొట్టుకోవ‌ద్ద‌ని ప‌వ‌న్‌కు సూచిస్తున్నారు. జ‌న క్షేత్రంలో తిర‌గ‌డ‌మే త‌ప్ప‌న‌ట్లుగా ప‌వ‌న్ చెబుతున్నారు..మ‌రి ప‌వ‌న్ చేస్తున్న‌దేంటి..? వేలెత్తి చూప‌డం కాదు…మ‌న వైపు ఎన్నివేళ్లు చూపుతున్నాయి అన్న విష‌యం గ్ర‌హించుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిద‌ని…అందులో రాజ‌కీయాల్లో తిరుగాడే వ్య‌క్తికి మ‌రింత అవ‌స‌ర‌మ‌ని జ‌నం గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా.. ప‌వ‌న్ తీరు మార‌దులే.. అంటూ పార్టీవ‌ర్గాల్లోనే సెటైర్లు వేసుకుంటున్నార‌ట‌.

పవన్ ఇలా అయితే నీ పరువు గంగ పాలే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share