ప‌వ‌న్‌, బాబులిద్ద‌రిదీ ఒకే మాట‌…

April 12, 2019 at 11:05 am

ఆంధ్ర‌ప్ర‌దేశ్లో ఎన్నిక‌లు ముగిశాయి. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోలింగ్‌లో ఓట‌ర్లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. హోరాహోరీ ప్ర‌చారంలో అన్ని పార్టీలు త‌మ‌త‌మ హామీలు, మేనిఫెస్టోల‌తో ప్ర‌జ‌ల‌ను బాగానే ప్ర‌భావితం చేసినా చివ‌ర‌కు ఓట‌రు మాత్రం త‌న సొంత నిర్ణ‌యాన్ని మొహ‌మాటం లేకుండా ఓటింగ్ యంత్రాల్లో భ‌ద్ర‌ప‌రిచారు. అయితే ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అర్థ‌రాత్రి వ‌ర‌కు కూడా ప‌లు జిల్లాల్లో ఓట‌ర్లు స‌హ‌నంతో ఓటు వేయ‌డం చూస్తే మాత్రం క‌చ్చితంగా మార్పును కోరుతున్నార‌ని మాత్రం అర్థం చేసుకోవ‌చ్చు.

ఎన్నిక‌ల వేళ పార్టీ అధినేత‌ల‌కు పూర్తిగా సీన్ అర్థ‌మ‌య్యిన‌ట్టుంది. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు రాష్ర్టంలోని పూర్తి ప‌రిస్థితి అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్టుంది. ఇన్ని రోజులుగా ఎక్క‌డా త‌మ‌త‌మ బండారం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డిన ఈ ఇద్ద‌రు ఇక చివ‌రి రోజు ఏదైతే అది అయ్యిందిలే అనుకున్నారో ఏమో విడివిడిగానైనా ఒకే మాట‌కు వ‌చ్చారు. ఓట‌మిని ముందు అంగీక‌రించిన‌ట్టుగా త‌మ మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు.

బాబు, ప‌వ‌న్ ఇద్ద‌రు కూడా ఓటింగ్ యంత్రాల్లో అవ‌క‌త‌వ‌కలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఈవీఎంల‌లో ఫ్రాడింగ్ వైసీపీకి అనుకూలించేదిగా ఉంద‌ని, త‌మ పార్టీల‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఎక్క‌డా ఇలాంటి వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఈ ఇద్ద‌రు ఇప్పుడు ఫ‌లితాల ముంగిట త‌మ అసంత్రుప్తిని ఒకేలా వెల్ల‌గ‌క్క‌డం చూస్తుంటే ఓట‌రు నాడి ఈ పాటికే ఇద్ద‌రికీ అర్థ‌మై ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయినా ఈవీఎంల‌ను ప‌రిచ‌యం చేసిందే నేను, టెక్నాల‌జీని వాడుకుంటేనే పురోగ‌తి అని లెక్చ‌ర్లు దంచే చంద్ర‌బాబు ఇప్పుడు అన్నీ అయిపోయాక ఏమీ చేయ‌లేక నెపాన్ని ఈవీఎంల‌పై నెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటేనే ముందే ఓట‌మికి సిద్ధ‌మైనట్టుగా తెలుస్తోంది. కాగా, తెర‌వెన‌క స్నేహం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డిన బాబు, ప‌వ‌న్లు ఇద్ద‌రూ ఇప్ప‌డూ మిష‌న్ల వైఫ‌ల్యాన్ని ఉమ్మ‌డిగా ఓట‌మికి కార‌ణంగా చెప్ప‌డం చూస్తుంటేనే వారి మిత్ర‌బంధం ఎంత గొప్ప‌దో తెలిసిపోతోంది.

ప‌వ‌న్‌, బాబులిద్ద‌రిదీ ఒకే మాట‌…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share