ప‌వ‌న్ అటు ఇటు తిరిగి… బాబు గూటికే…

November 2, 2019 at 12:28 pm

రాజ‌కీయాల్లో ఒకే ఒక్క రాంగ్ స్టెప్ నేత‌ల త‌ల‌రాత‌లు మార్చేస్తుంది. ఎన్ని సంవ‌త్స‌రాలు ఎంత గొప్ప రాజ‌కీయ నేత‌గా ఉన్న ఏదో ఆవేశంలో తీసుకునే చిన్న పొర‌పాటు నిర్ణ‌యాలే బ‌డా బ‌డా నేత‌ల జాత‌కాలు మార్చేస్తాయి. అందుకు ఏపీలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌లే నిద‌ర్శ‌నం. కోట్ల‌, కిషోర్ చంద్ర‌దేవ్ లాంటి నేత‌లు టీడీపీ నుంచి పోటీ చేస్తే వాళ్ల‌పై రాజ‌కీయంగా అస‌లేమాత్రం అనుభ‌వం లేని యువ‌త‌రంగ్‌లు విజ‌యం సాధించారు. రాజ‌కీయాల్లో రాణించాల‌నుకునేవారు జీవితాంతం అందులో త‌ల‌మున‌క‌లు అవ్వాల్సి ఉంటుంది. ఎన్ని సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డినా ఎక్క‌డా చిన్న త‌ప్పుకూడా రాకుండా చూసుకోవాలి… లేదా ఒక్కోసారి ఎన్ని సంవ‌త్స‌రాల అనుభ‌వం అయినా ఎందుకు కొర‌కాకుండా పోతుంది. అందుకు చంద్ర‌బాబే బెస్ట్ ఎగ్జాంపుల్‌.

ఇదంతా ఎవ‌రి గురించో చెపుతోన్న ఉపోద్ఘాతం కాదు జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి చెపుతోందే. అన్న పెట్టిన ప్ర‌జారాజ్యంలో యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ప‌వ‌న్ ఆ పార్టీ మూత‌తో 2014 ఎన్నిక‌ల‌కు ముందే జ‌న‌సేన పార్టీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేసి ఉంటే ఓడిపోయినా ఐదేళ్ల పాటు పోరాటం చేసి ప్ర‌జ‌ల్లు ఉండి ఈ యేడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఉంటే ప‌వ‌న్ ఇమేజ్ ఖచ్చితంగా మ‌రోలా ఉండేది. ఆ రోజు ప‌వ‌న్ బీజేపీ, టీడీపీకి స‌పోర్ట్ చేయ‌డం… చివ‌ర‌కు ఈ ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీల‌తో విబేధించి సొంతంగా పోటీ చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు కూడా న‌మ్మ‌ని ప‌రిస్థితి.

ఇక ఇప్పుడు అదే ప‌వ‌న్ మ‌ళ్లీ టీడీపీ, బీజేపీ మ‌ద్ద‌తు కోరుతుండ‌డంతో ప‌వ‌న్‌పై స‌హ‌జంగానే సెటైర్లు ప‌డ‌క ఏం ప‌డ‌తాయి. 2014 ఎన్నిక‌ల టైంలో అంత‌టి చంద్ర‌బాబే ప‌వ‌న్ ఇంటికి వెళ్లి చ‌ర్చలు జ‌రిపి మ‌రీ మ‌ద్ద‌తు కోరారు.. న‌రేంద్ర‌మోదీ అంత‌టి వాడే ప‌వ‌న్‌ను త‌న ప‌క్క‌న కూర్చోపెట్టుకున్నాడు. నాడు పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ క్లీన్ ఇమేజ్ అది. నాలుగేళ్ల పాటు ప‌వ‌న్ నిల‌క‌డ‌లేని రాజ‌కీయాలు చేయ‌డంతో ఆయ‌న వీరాభిమానుల‌కే విసుగు వ‌చ్చి ఈ ఎన్నిక‌ల్లో న‌మ్మ‌లేదు.

ఇప్పుడు మోదీ రెండోసారి ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక ప‌వ‌న్‌ను క‌నీసం పిల‌వ‌ను కూడా పిల‌వ‌లేదు. అస‌లు ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ అడిగినా ఇస్తాడ‌న్న‌ది సందేహ‌మే. ఇక చంద్ర‌బాబుకు ఏపీలో దిక్కు దివాణం లేని ప‌రిస్థితులు ఉండ‌డంతో మ‌ళ్లీ ప‌వ‌న్‌తో భేర‌సారాలు ఆడడంలో ఆశ్చ‌ర్యం లేదు. ప‌వ‌న్ ఈ ఐదేళ్ల‌ల రాజ‌కీయంగా సాధించింది ఏం లేదు. చివ‌ర‌కు తాను పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. ఏపీలో క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించే ప‌రిస్థితి కూడా లేదు.

7 శాతం ఓట్లు… 1 సీటు ఉన్న ప‌వ‌న్ కంటే నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన బీజేపీయే దూకుడుగా ముందుకు వెళుతోంది. అస‌లు ఏపీలో బీజేపీని ప్ర‌జ‌లు అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. తాము ఏ పార్టీకి స‌పోర్ట్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని చెపుతోంది. మ‌రి ఆ పాటి ధైర్యం ప‌వ‌న్‌కు లేదా ? ప‌వ‌న్ అస‌లు టీడీపీ, బీజేపీ మ‌ద్ద‌తు తీసుకుని ప్ర‌భుత్వంపై పోరాటం చేయాలా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. స‌హ‌జంగా ఏ పార్టీ అయినా త‌మ‌కు తాముగా ప్ర‌భుత్వంపై పోరాటం చేసి బ‌లం పెంచుకుంటుంది.. కానీ జ‌న‌సేన‌కు అంత మాత్రం ధైర్యం లేదా ? అన్న సెటైర్లు ప‌డ‌డంలో త‌ప్పులేదు. ప‌వ‌న్‌కు స‌పోర్ట్ చేసేది లేద‌ని బీజేపీ తేల్చిచెప్ప‌డంతో ప‌వ‌న్ మ‌ళ్లీ వ‌చ్చి టీడీపీ పంచ‌న చేరిపోవాల్సి వ‌చ్చింది. ఇలా అయితే ప‌వ‌న్ ఇక రాజ‌కీయంగా ఎదిగేదెప్పుడే ?  సాధించేది ఏంటో ?  ప‌వ‌న్‌కే తెలియాలి.

ప‌వ‌న్ అటు ఇటు తిరిగి… బాబు గూటికే…
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share