పవన్ సైలెంట్ దెబ్బ ..బాబు,జగన్లో కంగారు !

April 19, 2019 at 5:15 pm

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసి వారం అవుతోంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఇదే సమయంలో జనసేన కూడా ఉనికిని చాటుకునేందుకు గట్టి ప్రయత్నం చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని సీట్లు సంపాదించి కింగ్ మేకర్ గా అవతరించాలని కసరత్తు చేశారు. అయితే ఇక్కడ జనసేన ప్రధానంగా రెండు పార్టీలను ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి సైలెంట్ ఓటింగ్ ఎటు వైపు మొగ్గు చూపింది అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ విషయం అధికార టిడిపి ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో గుబులు రేపుతోంది.

ప్రధానంగా ఉత్తరాంధ్ర.. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ప్రభావం ఉంటుందని, సైలెంట్ ఓటింగ్ జనసేనకి అనుకూలంగా పడిందని పలు సర్వేలు చెబుతుండడం టీడీపీ వైసీపీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జనసేన పార్టీ 10 నుంచి 30 శాతం వరకు ఓట్లు సంపాదించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడు బలంగా టాక్ వినిపిస్తోంది. ఇది ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల్లో టిడిపి వైసిపి అభ్యర్థులను టెన్షన్ కు గురిచేస్తుంది. నిజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అయిన కాపులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే ఉండడంతో సైలెంట్ ఓటింగ్ మొత్తం జనసేన కి అనుకూలంగా పడి ఉంటుందని అని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సైలెంట్ ఓటింగ్ శాతం సుమారు 10 నుంచి 30 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇది టిడిపికి ఎక్కువగా నష్టం చేస్తుందా లేక వైసీపీని నష్టపరుస్తుందా అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. దీంతో టిడిపి వైసిపి అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తుంది. నిజానికి ఈ ఎన్నికల్లో జనసేన రెండు నుంచి మూడు సీట్లకంటే ఎక్కువ గెలవలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓట్లను మాత్రం ఎక్కువగా చీల్చి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆ చీలిన ఓట్లు టిడిపివా లేక వైసిపివా అన్నది మాత్రం కచ్చితంగా చెప్పడం కష్టం అని అంటున్నారు. ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే మే 23 వరకు ఆగాల్సిందే మరి చూద్దాం ఏం జరుగుతుందో..

పవన్ సైలెంట్ దెబ్బ ..బాబు,జగన్లో కంగారు !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share