ప‌వ‌న్ పాలిటిక్స్‌.. ఖేల్ ఖతం దుకాణం బంద్ ?

May 20, 2019 at 11:44 am

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోక‌పోతే.. ఎక్క‌డ ఎలాంటి వ్యూహం వేయాలో తెలియ‌క‌పోతే.. ఏం జ‌రుగు తుందో ఏపీలో మ‌రోసారి క‌ళ్ల‌కు క‌ట్టారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాజ‌కీయాలు అంటేనే వ్యూహ ప్ర‌తివ్యూహాలు. మ‌రి మ‌న‌కే కాదు.. ఎదుటివారికీ ఉంటాయి. వాటిలో మ‌నం చిక్కుకోకుండా.. మ‌న వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డం, ఎదుటి ప్ర‌త్య‌ర్థుల‌ను బుట్ట‌లో వేసుకోవ‌డం వంటివి క‌నీస రాజ‌కీయ వ్యూహాలు. అయితే, ఈ విష‌యంలో ప‌వ‌న్ త‌న వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం మ‌రిచిపోయి.. ఎదుటివారి వ్యూహంలో చిక్కుకుపోయి.. త‌న పార్టీని తానే భూస్థాపితం చేసుకున్నాడ‌నే వ్యాఖ్య‌లు తాజాగా వినిపిస్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో అనేక ఆశ‌లు పెట్టుకున్నారు ప‌వ‌న్ అండ్ పార్టీ నేత‌లు.

క‌నీసం 30 సీట్లలో గెలిచి క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామిలాగా ఏపీలోనూ ప‌వ‌న్ స్వామి అవుతార‌నే ప్ర‌చారం జ‌న‌సేన అధినేత పైఐ ఎక్కువ‌గానే సాగింది. నిజానికి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని చూసుకున్నా.. ఇదే త‌ర‌హా ఆలోచ‌న క‌నిపించింది. మేధావుల‌ను కూడా రంగంలోకి దింపారు ప‌వ‌న్‌. ఇక‌, త‌న ప్ర‌చారంలో న‌థింగ్‌బ‌ట్ టీడీపీ అన్న విధంగా ప్ర‌చారం చేశారు. దీంతో ప‌వ‌న్ ప్ర‌చార‌స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు యువ‌త పోటెత్తారు. ఆయ‌న ప్ర‌సంగాల‌కు ఎక్క‌డాలేని విధంగా ప్రాచుర్యం ల‌భించింది. చెవులు రెక్కించి మ‌రీ విన్న ప్ర‌జ‌లు త‌నకు ఓటేయ‌డం ఖాయ‌మ‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అయితే, ఇక్క‌డే ప‌వ‌న్ తానో వ్యూహం లో చిక్కుకుపోతున్నాన‌ని ఊహించ‌లేక‌పోయారు. అదే.. చంద్రన్న వ్యూహంలో ప‌వ‌న్ అడ్డంగా చిక్క‌కు పోయారు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పార్టీ పెట్టినా.. ఎన్నిక‌లకు దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు, బీజేపీల‌కు ప్ర‌చారం చేశారు. త‌న‌కు ఎన్నిక‌లు ప్ర‌ధానం కాద‌ని, సీట్లు, ఓట్ల‌తో త‌న‌కు ప‌నిలేద‌ని ప‌దే ప‌దే చెప్పిన ప‌వ‌న్‌.. సీఎం సీటుకు మాత్రం తాను ప‌నికిరానా? అనే ప్ర‌శ్న‌ను మాత్రం సంధించారు. ఇక‌, తీరా తాజా ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందు.. పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్నారు. తెర‌వెనుక చంద్ర‌న్న వ్యూహానికి తాను ఒత్తాసు ప‌లికారు. రాష్ట్రంలో బ‌లంగా ఉన్న వైసీపీని అధికారం నుంచి దూరం చేసేందుకు, తిరిగి తాను అధికారంలోకి రాక‌పోయినా ఫ‌ర్వాలేదు.. జ‌గ‌న్ మాత్రం రాకూడ‌ద‌నే వ్యూహాన్ని చంద్ర‌బాబు అమ‌లు చేశారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు జ‌గ‌న్‌కు ప‌డ‌కుండా.. ప‌వ‌న్ చ‌క్రాన్ని అడ్డుపెట్టారు. అయితే, ఊహించింది ఒక‌టైతే.. జ‌రిగింది మ‌రొక‌టి. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ సాధించిన సీట్లు కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక గాలిలో జనసేన సాధించలేకపోతోంది అంటే టీడీపీ-జనసేన డబుల్ గేమ్ సామాన్యులకు కూడా క్లియర్ గా అర్థమైందని తెలుస్తోంది. తాజా ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల్లో మరీ సున్నా నుంచి 5 స్థానాలు మాత్రమే అని తేల్చేయడంతో ఎటూ పాలుపోని పరిస్థితి. కనీసం ఒక్క స్థానం కూడా జనసేన గ్యారెంటీగా గెలుస్తుందని ఏ ఒక్క సర్వే కూడా చెప్పలేదు. అంటే పవన్ పోటీ చేసిన 2 స్థానాలపై కూడా గ్యారెంటీ లేదని అర్థమ‌వుతోంది. ఇదీ.. ప‌వ‌న్ పాలిటిక్స్‌!! మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ ఉంటుందా? జెండా పీకేస్తారా? చూడాలి.

ప‌వ‌న్ పాలిటిక్స్‌.. ఖేల్ ఖతం దుకాణం బంద్ ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share