మీడియాకు చిక్క‌ని ప‌వ‌న్‌..ఎందుకో తెలుసా ?

April 13, 2019 at 12:07 pm

అనుకున్న‌ది ఒక్క‌టీ…అయిన‌ది ఒక్కటీ…బోల్తా కొట్టిందిలే బుల్..బుల్‌..ప‌వ‌న్ అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నిక‌ల ప్రచారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌రుచూ ఒక‌ప‌దంపై ప‌దేప‌దే స్ప‌ష్ట‌త ఇచ్చారు…అదేంటంటే త‌న‌ను సీఎం కాకుండా ఎవ‌రూ అడ్డుకోలేర‌ని, వ‌చ్చేది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌ని, ప్ర‌జ‌లకు మంచి ప్ర‌భుత్వాన్ని అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. అయితే ఓటింగ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఈ సినీ, రాజ‌కీయ నేత‌కు హ్యాడిచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చిన ఆయ‌న మీడియాకు కూడా చిక్క‌కుండా దాక్కుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పవన్ ఎన్నిక‌ల ముందు బీరాలు ప‌లికి ఇప్పుడు ఎందుకు దాక్కుంటున్నార‌ని వైసీపీ శ్రేణుల నుంచి ఎత్తిపోడుపులు ఎదుర‌వుతున్నాయి. జ‌న‌సేన కనీస సంఖ్య‌లో కూడా సీట్లు సాధించ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాగా తెలుస్తోంది. మీడియా సంధించిన ప్రశ్నలకు ఏవిధంగా స‌మాధానం చెప్పాలో తెలియ‌క‌నే ప‌వ‌న్ దాగుండిపోతున్నారనే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కానీ పవన్ మాత్రం మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన పార్టీ కార్యాలయంలోనే కాలం గడుపుతూ వ‌స్తున్నారు.

అయితే ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టాల‌న్న సామెత‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ప‌వ‌న్ త‌న రాజ‌కీయ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేన అత్తెస‌రు సీట్ల‌ను సాధిస్తే ఏదో ఒక పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డం, కొంత మెరుగైన సీట్ల‌ను సాధిస్తే మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌భుత్వంలో పాల్గొన‌డం, ఇంకా మెరుగైన ఫ‌లితాల‌ను ద‌క్కించుకుంటే అంటే ప‌రిప‌రివిధాలుగా స్కెచ్చులు గీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే ప‌వ‌న్ 5సీట్ల‌కు మించి గెల‌వ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న విశ్లేష‌ణ‌. మ‌రి ఫ‌లితాల త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఆక్టివ్‌గా ఉంటాడా లేక అన్న‌లా పార్టీని మూసేస్తాడా చూడాలి మ‌రి.

మీడియాకు చిక్క‌ని ప‌వ‌న్‌..ఎందుకో తెలుసా ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share