ప‌వ‌న్‌ను నిండా ముంచింది వీళ్లేనా..!

May 4, 2019 at 1:18 pm

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఉన్న ఇమేజ్ వేరు. ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పు డున్న ఇమేజ్ వేరు. రాజ‌కీయంగా ఆయ‌న పుంజుకుంటార‌ని, రాజ‌కీయంగా రాష్ట్రంలో సంచ‌నాల‌కు వేదిక అవుతార‌ని అంద‌రూఅనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన వెనుక‌బ‌డి పోయారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని ప్ర‌తి జిల్లాలోనూ బ‌లంగా ఉంటార‌ని బావించినా.. ఆయ‌న ఎందుక‌నో కొన్ని జిల్లాలో అస‌లు సోదిలో కూడా లేకుండా పోయారు. దీనిపై ఇప్పుడు మేధావులు పోస్ట్ మార్ట‌మ్ చేస్తున్నారు. ఎందుకిలా జ‌రిగింది? అనే ప్ర‌శ్న వీరి నుంచి వినిపిస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల అనంత‌రం జ‌న‌సేన ముఖ‌చిత్రంలో అనేక మార్పులు వ‌చ్చాయి.

కీల‌క‌మైన ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాలు స‌హా కృష్ణా, అనంత‌పురంలో కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని ఈ పార్టీల‌పై అంచ‌నాలు ఉన్నాయి. అయితే, పోలింగ్ స‌ర‌ళి, ఎన్నిక‌ల ప్ర‌చారం అనంతరం మాత్రం పార్టీపై ఉన్న అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి. ఎన్నిక‌ల‌పై ఎన్ని స‌ర్వేలు వెలుగు చూసినా కూడా.. జ‌న‌సేన‌కు ఒక పార్ల‌మెంటు స్థానం, రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లోనే విజ‌యం వ‌స్తుంద‌ని చెబుతున్నాయి. కానీ, జ‌న‌సేన నాయ‌కులు మాత్రం ఇంకా ఊద‌ర గొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పార్టీ బాధ్య‌త‌లు నిర్వ‌మించినమాదాసు గంగాధ‌రం వంటివారు పార్టీ ని ఇంకా మోసేస్తు న్నారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా ఐదు పార్ల‌మెంటు స్థానాలు వ‌స్తాయ‌ని ఊరూ వాడా ట‌ముకు వేస్తున్నారు.

నిజానికి అన్ని సీట్ల‌లో విజ‌యం సాధించే స‌త్తా జ‌న‌సేన‌కు లేద‌నేది క‌ర‌డు గ‌ట్టిన ప‌వ‌న్ అభిమానులు కూడా ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్న మాట‌. కానీ, మాదాసు వంటివారు మాత్రం త‌మ‌దే విజ‌యమ‌ని, పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప డం చిత్రంగా ఉంది. ఇక‌, ఎన్నిక‌ల స‌ర‌ళిని, ప్ర‌చారాన్ని గ‌మ‌నించిన త‌ర్వాత కూడా వారు ఇలానే చెబుతున్నారంటే.. స్వామి భ‌క్తి అనుకోవాలా? లేక‌, స్వామికి భ‌జ‌న చేస్తూ.. గోతులు త‌వ్వుతున్నార‌ని భావించాలా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఇప్పుడు కూడా వీరు ఇలా చెబుతున్నారంటే.. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్‌కు ఎంత‌గా నూరిపోసి ఉంటారు? మీదే రాజ్యం అన్న‌ట్టుగా ఆయ‌న‌కు ఎన్నిక‌థ‌లు వినిపించి ఉంటారు? అనే చ‌ర్చ సాగుతోంది.

మ‌రి వీరి మాట‌లు న‌మ్మే ప‌వ‌న్ నిండా మునిగారా? అనే ప్ర‌శ్న కూడా ఉద‌యిస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ముందు ఎన్ని భ్రమలు కల్పించి ఉంటారో అర్థమౌతోంది. జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఫెయిల్ కావడానికి ఇలాంటి భజన బృందమే కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోపాయికారీగా టీడీపీతో ఒప్పందం చేసుకున్నారనే విషయం జనానికి తెలిసిపోవడం ఒక కారణమైతే, లేనిపోని గొప్పల్ని ఊహించుకుని నేలవిడిచి సాము చేయడంతో ఆశించిన మేర‌కు కూడా ఫ‌లితం ఆశాజ‌న‌కంగా ఉండ‌ద‌ని అంటున్నారు. ఏదేమైనా పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోయిన ప‌వ‌న్‌దే త‌ప్ప‌ని అంటున్నారు మేధావులు.

ప‌వ‌న్‌ను నిండా ముంచింది వీళ్లేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share