ప‌వ‌న్ స్వ‌యంకృతం.. పార్టీ ఖాళీ అవుతోందా…!

May 3, 2019 at 1:02 pm

ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టి.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తాన‌ని చెప్పిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేనకు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆయా ప‌ద‌వుల‌కు రాజీ నామా చేస్తు న్న‌ట్టు పేర్కొని రాజీనామా ప‌త్రాల‌ను అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కు కూడా పంపేశారు. ఈ ప‌రిణామం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రే పింది. పాతికేళ్ల ప్ర‌స్థానం కోసం తాను రాజీక‌యాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. పాతిక నెల‌లు కూడా పార్టీని కాపాడుకునే ప‌రిస్థితి లేక పోవ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం, విచారం వ్య‌క్తమ‌వుతోంది. జ‌న‌సేన పార్టీ ట్రెజ‌ర‌ర్ మ‌ర్రిశెట్టి రాఘ‌వ‌య్య, జ‌న‌సేన కార్య‌క్ర‌మాల నిర్వాహ‌కుడు చింత‌ప‌ల్లి అర్జున్‌లు త‌మ త‌మ ప‌ద‌వుల‌కు, పార్టీకి కూడా రిజైన్ చేసేశారు.

ఎన్నిక‌లు ముగిసిన కేవ‌లం 20 రోజుల వ్య‌వ‌ధిలోనే, ఇంకా ఫ‌లితాలు కూడా రాకుండానే ఇలా ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు పార్టీని వీడ‌డం ఒక భాగ‌మైతే.. ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఇంకా 20 రోజుల స‌మ‌యం ఉన్నందున, ఈ లోగా, ఫ‌లితాలు వ‌చ్చాక ఇంకెంత మంది బ‌య‌ట‌కు వ‌స్తారో అని చ‌ర్చించుకుంటున్నారు. ఇక‌, మేధావి వ‌ర్గం మాట మ‌రోలా ఉంది. ఈ ప‌రిణామాల‌కు ప‌వ‌న్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. పార్టీని స్థాపించి, దాని నిర్వ‌హ‌ణ‌లో త‌డ‌బ‌డి, 18 స్థానాల్లో విజ‌యం సాధించినా కూడా పార్టీని న‌డిపించ‌లేక కాంగ్రెస్‌లో విలీనం చేసిన సొంత అన్న అనుభ‌వాన్ని క‌ళ్లారా చూసిన ప‌వ‌న్‌.. త‌న పార్టీని నిల‌బెట్టుకునేందుకు వేసిన ప్ర‌ణాళిక‌లు కానీ, త‌న పార్టీని న‌డిపించుకునేందుకు అనుస‌రించిన మార్గం కానీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదని అంటున్నారు.

పార్టీని స్థాపించ‌డ‌మే కాదు, దానిని నిల‌బెట్టుకోవ‌డం ఎంతో ప్ర‌ధానం. ముఖ్యంగా ఏపీ వంటి విభిన్న మ‌న‌స్త‌త్వాలు, సెంటి మెంటుకు అస్స‌లు తావులేని రాష్ట్రంలో పార్టీని న‌డిపించ‌డం క‌త్తిమీద సాములాంటిందే. ఈ విష‌యాన్ని తెలిసి కూడా ప‌వ‌న్ వేసిన అడుగులు త‌ప్ప‌టడుగులుగా మారాయ‌ని వారు చెబుతున్నారు. 2014లో పార్టీని స్థాపించి కూడా టీడీపీకి మ‌ద్ద‌తిచ్చారు. స‌రే! ఇప్పుడు 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యానికి పూర్తిగా పుంజుకుని బ‌ల‌మైన ప‌క్షంగా ఎదుగుతాడ‌ని ప‌వ‌న్ అభిమానులు, ఆయ‌న ఫ్యామిలీ కూడా భావించారు. అయితే, ఎక్క‌డిక‌క్క‌డ ప‌వ‌న్ వ్యూహాలు పార్టీ ని తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తీశాయ‌ని అంటున్నారు. రాష్ట్రంలోని ఓ రాజ‌కీయ అప‌ర చాణిక్యుడి వ‌ల‌లో చిక్కినట్టుగా ప‌వ‌న్ గురించి తెలిసిన వారు అంటున్నారు.

`ఆ మేధావి` సూచ‌న‌లతోనే అడుగులు వేశార‌ని, ఫ‌లితంగా ఇప్పుడు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయ‌ని అంటున్నా రు. వాస్త‌వానికి రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ దిక్కు చూసినా.. రెండు రాజ‌కీయ పార్టీలే క‌నిపిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు మూడో పార్టీని కోరుకున్నారు. దీనికి అనుకూలంగా ప‌వ‌న్ పార్టీ పోటీ చేస్తోంద‌ని తెలిసి పండ‌గ చేసుకున్న వారు ఉన్నారు. అయితే, ఎన్నిక‌ల నామినే ష‌న్ల ప్ర‌క్రియ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ప‌వ‌న్ అనుస‌రించిన వ్యూహం ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం న‌చ్చ‌లేద‌నేది నిష్ఠుర స‌త్యం. అదికార ప‌క్షానికి తెర వెనుక మ‌ద్దతివ్వ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఏవ‌గించుకున్నారు. ఇక‌, వైసీపీ, టీడీపీల నుంచి దూరంగా ఉన్న త‌ట‌స్థ నాయ‌కుల‌ను చేర‌దీయ‌డంలోనూ ప‌వ‌న్ విఫ‌ల‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌లేక పోయారు. ప్ర‌ధాన పోరు .. వైసీపీ-టీడీపీల మ‌ధ్యే జ‌ర‌గ‌డం దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. దీంతో పార్టీ ఎన్నిక‌ల ఫ‌లితాల కు ముందుగానే ఖాళీ అవుతుందా? అనే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

ప‌వ‌న్ స్వ‌యంకృతం.. పార్టీ ఖాళీ అవుతోందా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share