ప‌వ‌న్ ఏం చేస్తున్నాడో తెలియ‌ని వైనం..!

June 24, 2019 at 10:54 am

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్తాడు? ఎలాంటి వ్యూహంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తా డు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల్లో మార్పు స‌హా స‌మాజంలో మార్పు తెస్తానంటూ.. ప్ర‌జాక్షేత్రంలోకి అడు గు పెట్టారు ప‌వ‌న్‌. 2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నా.. తాజా ఎన్నిక‌ల్లో మాత్రం పోటీ చేశారు. మొత్తం 143 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి పోటీ చేశారు. తాను స్వ‌యంగా రెండు స్థానాల్లో పోటీ చేశారు.

అయితే, కేవలం రాజోలు నియోజక వ‌ర్గంలో మాత్ర‌మే రాపాక విజ‌యంసాధించారు. ఒక ప‌క్క సినీ గ్లామ‌ర్‌, మ‌రోప‌క్క పూర్తి మాస్ ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావ‌డంలో ప‌వ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో ఏ పార్టీ నాయ‌కుడైనా ఏం చేయాలి? ఏం చేస్తారు? క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిపై అంచ‌నా వేసుకుంటారు. తాను ఏం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల మ‌నసులు దోచుకోవాలో నిర్ణ‌యించుకుని, దానికి అనుకూలంగా అడుగులు వేస్తారు. కార్య‌క‌ర్త‌ల‌ను బ‌లోపేతం చేసుకుంటారు.

అయితే, ఈ విష‌యాల్లో ప‌వ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేది నిజం. ప‌వ‌న్‌కు లెక్క‌లేనంత మంది అబిమానులు ఉన్నారే త‌ప్ప పార్టీ కార్య‌క‌ర్త‌లు మాత్రం లేరు. దీంతో ఇప్పుడు వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాల‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అయితే, దీనిపై ప్ర‌ధానంగా దృష్టి పెట్ట‌డంలో ప‌వ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత స‌మీక్ష‌లు చేసుకుని, కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా నింపి.. వ్యూహాత్మ‌కంగా మ‌రోసారి ఎన్నిక‌ల‌కు సిద్ధం కావ‌డం ఏ రాజ‌కీయ పార్టీకైనా తెలిసి ఉండాలి.అయితే, ప‌వ‌న్ మాత్రం ఏదో మొక్కుబ‌డిగా స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం త‌ప్ప ప్ర‌త్యేకంగా చేస్తున్న దిశానిర్దేశం ఏమీ క‌నిపించ‌డం లేదు.

మ‌రోప‌క్క‌, పార్టీలోని కీల‌క నాయ‌కులు ఫ‌లితాల త‌ర్వాత ప‌వ‌న్‌తో అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిని బుజ్జ‌గించ‌డం లేదా కీల‌క‌మైన ప‌ద‌వులు అప్ప‌గించ‌డం వంటి అంశాల‌పై ప‌వ‌న్ దృష్టి పెట్ట‌లేదు. ఇప్ప‌టికే రావెల కిశోర్‌బాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనార‌య‌ణ ప‌క్క చూపులు చూడ‌డం వంటి విష‌యాల‌పై వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

ప‌వ‌న్ ఏం చేస్తున్నాడో తెలియ‌ని వైనం..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share