ప‌వ‌న్‌కు కేటీఆర్ కౌంట‌ర్‌

March 23, 2019 at 12:38 pm

ఏపీలో రాజ‌కీయాలు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే దిశ‌గా వెళ్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ఖాయ‌మైన వేళ‌.. అధికార టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఓట‌మి భ‌యంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌లు అంత‌ర్గ‌తంగా కుమ్మ‌క్కు అయి.. తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు తీవ్ర‌వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గుంటూరు స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి. అయితే.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

‘మనం ఇక్కడ మతాలుగా, కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం.. కానీ తెలంగాణలో ఆంధ్రవాళ్లంటే అలుసు.. కుల వర్గ భేదాలు లేకుండా మన వాళ్లను కొడుతున్నారు’ అంటూ జ‌న‌సేన అధినేత‌ పవన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా, భావోద్వేగాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడటం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు. ఒక‌నాడు టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పొగిడిన ప‌వ‌న్‌.. ఇప్పుడు ఇలా మాట్లాడ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. ఆంధ్ర ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్న‌ ప‌వ‌న్‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ‌లో ఆంధ్రుల‌ను కొడుతున్నారంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పవన్‌ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు ..‘ దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడ చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారాలు ప్రసారం చేస్తున్నారు’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ప‌వ‌న్‌కు కేటీఆర్ కౌంట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share