ప‌వ‌న్ గుట్టు వైసీపీ చేతిలో …!

September 17, 2019 at 10:49 am

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జగన్ వందరోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్‌పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మండిప‌డుతున్నారు. ’’పవన్‌ కల్యాణ్‌ లావాదేవీలను బయటకు తీస్తాం. లింగమనేని రమేష్ వద్ద పవన్ కళ్యాణ్‌ ఎకరం రూ.25 లక్షలు పెట్టి కొన్నారా ? అది బ్లాక్ మనీతో కొన్నారా ? చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఒప్పందం వల్ల లింగమనేని ఇచ్చారా? ఈ విషయాలన్నీ బయటకు తీసుకొని వస్తాం ’’ అని అంబ‌టి ప‌వ‌న్‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు.

జ‌న‌సేన నివేదిక చూస్తుంటే ప‌వ‌న్ – బాబు క‌లిసి కూర్చొని రాసిన‌ట్టుగా ఉంద‌ని అంబటి ఎద్దేవా చేశారు. ఇక బాబు ముందు బెంచీలో కూర్చొని ప‌రీక్ష రాస్తుంటే.. ప‌వ‌న్ వెన‌క బెంచీలో కూర్చొని కాపీ కొట్టిన‌ట్టు ఉంద‌ని విమ‌ర్శించారు. వైసీపీ మ‌రో 100 సంవ‌త్స‌రాలు పాల‌న చేసినా కూడా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ తమకు మంచి సర్టిఫికెట్‌ ఇవ్వరని అంబటి రాంబాబు తెలిపారు. త‌మ‌కు ఎవ‌రి స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌జ‌ల స‌ర్టిఫికెట్ ఉంటే చాల‌న్నారు.

ఏదేమైనా అంబ‌టి వ్యాఖ్య‌లు చూస్తుంటే ప‌వ‌న్‌ను ఆధారాల‌తో స‌హా స్ట్రాంగ్‌గానే టార్గెట్ చేసేలా వైసీపీ వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాజ‌ధాని ఏరియాలో ప‌వ‌న్‌కు ఉన్న భూముల వివ‌రాల‌తో పాటు ఇత‌ర‌త్రా ఆస్తులు ఎక్క‌డెక్కడ ఉన్నాయి ? ఎలా వ‌చ్చాయ‌నే అంశంపై వైసీపీ పెద్ద‌లు దృష్టి పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్ లోగుట్టు ఎంత వ‌ర‌కు ఉందో ? ఈ విష‌యంలో వైసీపీకి దొరికిపోతాడా ? లేదా ? అన్న‌ది చూడాలి.

ఇక ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల మృతిపై అంబటి స్పందించారు. ఆయన మరణంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి… వీటిపై తెలంగాణ సర్కార్ నిష్సక్షపాత విచారణ జరిపించాలన్నారు. కోడెల మృతిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు.

ప‌వ‌న్ గుట్టు వైసీపీ చేతిలో …!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share