ర‌జ‌నీ పార్టీలోకి పొలిటిషీయ‌న్లు, హీరోలు, హీరోయిన్లు

May 30, 2017 at 5:05 am

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ పార్టీ పెట్ట‌డం క‌న్ఫార్మ్ కావ‌డంతో ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీ ఏంటి ? పార్టీ విధివిధానాలు ఎలా ఉంటాయి ? ర‌జ‌నీ బీజేపీతో పొత్తు పెట్టు కుంటారా ? లేదా ? ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటారా ? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు మీడియాలో ఎవ‌రికి వారు సంధించుకుని చ‌ర్చ‌లు పెట్టేసుకుంటున్నారు. ఎవ‌రి చ‌ర్చ‌లు, ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా ర‌జ‌నీ పార్టీకి అప్పుడే పొలిటిక‌ల్ గ్లామ‌ర్‌, సినీ గ్లామ‌ర్ యాడ్ అయిపోయింది.

ఇప్ప‌టికే ఓ ద‌ఫా అభిమానుల‌తో స‌మావేశ‌మైన ర‌జ‌నీ మ‌రోసారి వారితో మీట్ అయ్యి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక పార్టీ ఎనౌన్స్ చేయ‌నున్నాడు. జూన్ ఎండింగ్ లేదా జూలై స్టార్టింగ్‌లో ర‌జ‌నీ కొత్త పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకునే ఛాన్సుల‌పై కూడా ర‌జ‌నీ ఆలోచ‌న‌లు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ర‌జ‌నీ ప‌క్కా ప్లానింగ్‌తో పొలిటిక‌ల్ కెరీర్ ప్లాన్ చేసుకునే ప‌నిలో ఉన్నారు.

ఇక క‌మ‌ల‌నాథులు సైతం త‌మిళ‌నాడులో పాగా వేసేందుకు ర‌జ‌నీని వాడుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు మోడీతో ర‌జ‌నీ భేటీ ఏర్పాటు చేస్తామ‌ని ర‌జ‌నీకి ఇప్ప‌టికే క‌బురు పంపారు. ఇదిలా ఉంటే ర‌జ‌నీ పార్టీ పెడ‌తార‌న్న ఎనౌన్స్‌తోనే ఆయ‌న పార్టీకి పొలిటిక‌ల్‌, సినీ గ్లామ‌ర్ యాడ్ అయిపోయింది.

త‌మిళ‌నాడులో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు అయిన అన్నాడీఎంకేకు చెందిన పాండ్యరాజన్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. పాండ్య‌రాజ‌న్‌తో పాటు గ‌తంలో రెండుసార్లు ఎంపీగా, యూపీఏ హయాంలో మంత్రిగా చేసిన ఎస్‌ జగత్‌రక్షకన్‌, చెన్నైకి చెందిన అన్నాడీఎంకే నేత, కాంగ్రెస్‌ నేత కరాటే త్యాగరాజన్‌ కూడా రజనీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అక్క‌డ రాజ‌కీయ వ‌ర్గాల క‌థ‌నం.

ఇక ఇప్ప‌టికే హీరోయిన్లు న‌మిత‌, మీనా సైతం ర‌జ‌నీ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా ర‌జ‌నీ పార్టీ త‌మిళ‌నాడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

 

ర‌జ‌నీ పార్టీలోకి పొలిటిషీయ‌న్లు, హీరోలు, హీరోయిన్లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share