రజిని వెనుకడుగు ..మ‌ళ్లీ దానికే ఓటు..!

January 5, 2019 at 12:31 pm

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లే క‌న‌బడుతోంది. మొద‌టి అడుగుల్లోనే ఆయ‌న రాజ‌కీయాల నుంచి వెనక్కు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ప‌ట్టుమ‌ని ఐదు నెల‌లు కూడా లేని త‌రుణంలో ఆయ‌న మ‌రోసారి సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌నకు ఇప్ప‌టికే ప‌లువురు త‌మిళ డైరెక్ట‌ర్లు క‌థ‌లు వ‌నిపించిన‌ట్లు స‌మాచారం. ఇక బాహుబ‌లి సినిమాతో దేశంలోని న‌టులంద‌రినీ త‌న‌వైపు తిప్పుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళితో కూడా రజ‌నీ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.1rajinikanthkabalimoviestill

ఇక సంక్రాంతి సందర్భంగా రజనీకాంత్ సినిమా పేట విడుదల కానుంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా, భాషా టైప్ లో ఈ సినిమా కనిపిస్తోంది. ఇక ఇది పూర్త‌యిన నేప‌థ్యంలో విభిన్న సినిమాల దర్శకుడు మురుగదాస్ తో రజనీకాంత్ ఒక సినిమాను చేయబోతున్నట్టుగా త‌మిళ చిత్ర వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న స‌మాచారం. అది కూడా ప్యూర్ మాస్ ఎంటర్ టైనరే అని తెలుస్తోంది. ఇలా వరసగా రజనీకాంత్ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక ఇవి మాత్రమేగాక.. రజనీకాంత్ మరిన్ని సినిమాలకు కూడా కమిట్ అవుతున్నాడని సమాచారం. పేట దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. ఈ మధ్య రజనీకాంత్ ఒకే దర్శకుడితో వరసగా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు.

Chennai: Super star Rajinikanth addresses fans at an event at Raghavendra Kalyana Mandapam in Chennai  on Monday. PTI Photo(PTI5_15_2017_000144A)

Chennai: Super star Rajinikanth addresses fans at an event at Raghavendra Kalyana Mandapam in Chennai on Monday. PTI Photo(PTI5_15_2017_000144A)

వాస్త‌వానికి ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఇక సినిమాల‌కు దూరంగా ఉంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వ‌రుస సినిమాల‌కు సైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇక ఎన్నిక‌ల‌కు అత్యంత కీల‌క‌మైన ఐదు నెల‌ల్లో కూడా ర‌జ‌నీ నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఆయ‌న ద్వారా రాజ‌కీయ అరంగేట్రం చేయాల‌నుకున్న వారు, ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న వారు కొంత నిరాశ‌కు గుర‌వుతున్నార‌ని స‌మాచారం. ఏది ఏమైనా రజ‌నీ రాజ‌కీయాల్లో రాణించాలంటే ఇప్పుడు తీసుకోబోయే నిర్ణ‌యాలే ఆయ‌న భ‌విష్య‌త్ జీవితాన్ని ప్ర‌భావితం చేయ‌నున్నాయి. మ‌రి రజ‌నీకాంత్ ఏం చేస్తారో వేచి చూడాలి.

రజిని వెనుకడుగు ..మ‌ళ్లీ దానికే ఓటు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share