ముక్కోణ‌పు పోటీలో రామ‌చంద్రాపురం రాజెవ‌రు..!

May 13, 2019 at 3:34 pm

రామచంద్రాపురం. రాష్ట్ర వ్యాప్తంగాచ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది కూడా ఒక‌టి. ఇక్క‌డ నుంచి ఆరుసార్లు పోటీచేసి నాలుగు సార్లు విజ‌యం సాధించిన తోట త్రిమూర్తులు పార్టీల‌కు అతీతంగా మ‌ద్ద‌తు కూడ‌గట్టారు. త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. 1994లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో వ‌చ్చిన తోట .. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీలో చేరిపోయారు. అక్క‌డి నుంచి ఆయ‌న ఆ పార్టీలోనే కొన‌సాగుతూ.. మ‌ధ్య‌లో ప్ర‌జారాజ్యంలోకి, ఒక‌సారి కాంగ్రెస్ లోకి వెళ్లినా.. తిరిగి టీడీపీలోనే చేరిపోయారు. ఇక్క‌డ నుంచి నాలుగు సార్లు విజ‌యం సాధించిన ఆయ‌న ప్ర‌తిసారీ మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌తోనే ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో త‌ల‌ప‌డ్డారు.

అయితే, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ముక్కోణ‌పు పోటీ నెల‌కొంది. టీడీపీ నుంచి 2014లో విజ‌యం సాదించిన తోట ఇప్పుడు అనూహ్య‌మైన పోటీని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కాపు, శెట్టిబ‌లిజ‌ వ‌ర్గానికి ప్రాధాన్యం ఉన్న ఈ నియోజ‌కవ‌ర్గం లో శెట్టి బ‌లిజ వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు పోరు చేశారు. టీడీపీ నుంచి తోట‌, వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుగో పాల‌కృష్ణ పోటీ చేశారు. జెడ్పీ మాజీ చైర్మ‌న్‌గా నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టి ప‌ట్టు సాధించారు. వాస్త‌వానికి ఇక్క‌డ నుంచి పిల్లి పోటీ చేయాల‌ని అనుకున్నా.. చివ‌రి నిముషంలో తోట‌కు గ‌ట్టిపోటీ ఇవ్వాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి చెల్లుబోయిన‌కు ఛాన్స్ ఇచ్చారు.

గ‌త ఎన్నిక‌ల్లో కాకినాడ రూర‌ల్ నుంచి పోటీ చేసిన చెల్లుబోయిన ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేశారు. ఇక‌, మూడోపార్టీ జ‌న‌సేన నుంచి పోలిశెట్టి చంద్ర‌శేఖ‌ర్ రంగంలోకి దిగారు. దీంతో రామ‌చంద్రాపురంలో పోటీ హోరీహోరీగా సాగింది. సుమారు 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్లున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 80శాతానికి పైగానే పోలింగ్ జ‌రిగింది. తోట, చంద్రశేఖర్ పోలిశెట్టి ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఈ సామాజిక వ‌ర్గం ఓట్లు చీలాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో కాపు వ‌ర్గం ఓట్లు మొత్తం జ‌న‌సేన అభ్య‌ర్థికి ప‌డ్డాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ముక్కోణ‌పు పోటీలో రామ‌చంద్రాపురం రాజెవ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share