కెసిఆర్ ని టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ

April 4, 2019 at 11:08 am

సినీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌రిచ‌యం అక్క‌ర లేని వ్య‌క్తి. ఏ ప‌ని చేసిన త‌న మార్కుతో ప్ర‌త్యేక‌త చాటుకోవ‌డం ఆయ‌న‌కే సాధ్యం. మొత్తం సినీ లోకానిదంతా ఒక దారైతే, వ‌ర్మ దానికి భిన్న‌మైన దారిలో వెళ్తుంటారు. ఎప్పుడూ ఏదో ఒక వివాద‌మో, విశేషంతోనే వార్త‌ల్లో నానుతూనే ఉంటారు. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని చాలా మంది ఉబ‌లాట‌ప‌డుతుంటారు కూడా. సినిమాను తీసే విధానంలో త‌న‌కు తానే సాటి, తానే పోటీ అనే విధంగా హైప్ క్రియేట్ చేసుకున్న మోస్ట్లీ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌.

అలాంటి ట్రెండ్ సెట్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీస్తున్నారు. ఇప్ప‌టికే చైన్ లాగి శివ‌తో ఒక‌రేంజ్‌లో ట్రెండ్ సెట్ చేసిన వ‌ర్మ ఆ త‌ర్వాత ద‌య్యాలు, బూతాలు అంటూ హ‌ర్ర‌ర్ దారి ప‌ట్టారు. కొన్నేళ్ల పాటు ఆ ఒర‌వ‌డిని సాగించిన వ‌ర్మ బోర్ కొట్టిన త‌ర్వాత దానిని వ‌దిలేశారు. కొద్ది రోజులు ఆడ‌వారిని అందాల ఆర‌బోత సీన్ల‌లో మురిపించిన వ‌ర్మ ఆ త‌ర్వాత వాటినీ దూరం పెట్టారు. ఆ త‌ర్వాత నిజాల‌ను వెలికి తీసే క‌థ‌లు వెతుక్కుంటూ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ సినిమాలు తీశారు. అదే ఒర‌వ‌డితో మ‌హానుభావులు, చ‌రిత్ర స్రుష్టించిన వారి జీవిత చ‌రిత్ర‌ల‌ను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు.

ఎన్టీయార్ నిజ జీవితంలోని ఘ‌ట‌న‌లు ఏర్చికూర్చి ల‌క్ష్మీస్ ఎన్టీయార్ తీసిన వ‌ర్మ మ‌రోవైపు త‌మిళ రాజ‌కీయాల్లో ముద్ర వేసుకున్న జ‌య‌ల‌లిత బయోపిక్‌కు కౌంట‌ర్‌గా **శ‌శిక‌ళ‌** సినిమాను తీసుకొస్తున్నారు. అదే క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, రాష్ర్ట సాధ‌న కోసం ప్రాణ‌త్యాగానికి వెన‌కాడ‌ని కేసీఆర్ జీవిత చ‌రిత్ర‌ను తెర‌పైకి తెచ్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ మేర‌కు వ‌ర్మ ఆస్థాన క‌వి సిరాశ్రీ కేసీఆర్ క‌థ‌ని సేక‌రించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో యేడాదిన్న‌ర‌లో వ‌ర్మ కేసీఆర్ బ‌యోపిక్ తీసుకురాబోతున్న‌ట్టు స‌మాచారం.

కెసిఆర్ ని టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share