జూనియర్ ఎన్టీఆర్ పై వ‌ర్మ సంచలన ట్వీట్‌

April 3, 2019 at 2:53 pm

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్ర‌బాబునాయుడుకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో చంద్ర‌బాబు బండారం బ‌య‌ట‌పెట్టిన వ‌ర్మ మాట‌ల దాడిని కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఆంధ్ర‌ప్రదేశ్ లో సినిమాను అడ్డుకోవ‌డంతో వ‌ర్మ తీవ్రంగా ర‌గిలిపోతున్న విష‌యం తెలిసిందే. బాబు టార్గెట్గా ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. తాజా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఉటంకించి ఆయ‌న మ‌రో ట్వీట్ చేయ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

సీనియ‌ర్ ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నిజ‌మైన వార‌సుడు, ఆయ‌న మ‌న‌వ‌డు అయిన జూనియ‌ర్ ఎన్టీయారే అని ప్ర‌క‌టించారు. పార్టీ పూర్తిగా జూనియ‌ర్ రామారావు చేతిలోకి వెళ్తేనే బాగుంటుంద‌న్నారు. ఎన్న‌టికున్నా తెలుగుదేశం ఆయ‌న బాబు చేతిలో నుంచి జూనియ‌ర్ చేతిలోకి వెళ్లాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. వార‌సుల‌మ‌ని చెప్పుకుంటున్న వారంతా పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని, వారి చేష్ట‌ల‌తో పార్టీకి కోలుకోలేని దెబ్బ‌లు త‌గిలిస్తున్నార‌న్నారు.

చంద్ర‌బాబు పై అక్క‌సును మరోమారు బ‌య‌ట‌పెట్టారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు ఓటు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న వాళ్లంతా మొద‌ట ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చూడాల‌ని వ‌ర్మ సూచించారు. సినిమాను పూర్తిగా చూసిన త‌ర్వాత చంద్ర‌బాబు జీవితంలో చేసిన మోసాలను తెలుసుకుని అప్పుడు ఎవ‌రికి ఓటెయ్యాలో నిర్ణ‌యించుకోవాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌ను, ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. కాగా, సినిమాను ఏపీలో రిలీజ్ చేయించ‌డానికి వ‌ర్మ సుప్రీంకోర్టు గుమ్మం కూడా ఎక్కారు. తాజాగా డిస్ర్టిబ్యూట‌ర్లు కూడా రిలీజ్‌పై స్తే ఎత్తేయాల‌ని, త‌మ‌కు జ‌రుగుతున్న‌న‌ష్టాన్ని పూడ్చాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ పై వ‌ర్మ సంచలన ట్వీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share