tv9 రవి ప్రకాష్ మాస్టర్ ప్లాన్ .. ఈసారి మరో సంచలనమే !

May 13, 2019 at 1:23 pm

ముఖేష్ అంబానీ… ఈ పేరు తెలియ‌ని వారు ఈ భార‌త‌దేశంలో ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో… ముఖేష్ అంబానీ అంటే ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రు. భార‌త దేశంలోనే నెంబ‌ర్ కుభేరుడు అంబాని. గుండు సూది నుంచి మొద‌లు విమానాల దాకా ఏ రంగంలో చూసుకున్న ముఖేష్ అంబానిదే సామ్రాజ్యం. ఇక అంబానీ గురించి ఎంత చెప్పిని త‌క్కువే. భార‌తీయ రాజ‌కీయాల‌ను శాసించే ఏకైక సామ్రాజ్య‌ధినేత ముఖేష్ అంబానీ. వ్యాపార రంగంలో ముఖేష్‌కు ఎదురు లేదు.

మీడియా రంగంలో భార‌త‌దేశంలోనే పేరెన్నికగ‌న్న‌ది టీవీ9. మీడియా రంగాన్ని శాసించిన అతికొద్ది మందిలో ఒక‌రు ర‌విప్ర‌కాశ్‌. మీడియా రంగానికి కొత్త పుంత‌లు తొక్కించి దేశానికే ఓ కొత్త‌కోణంను ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తి ర‌విప్ర‌కాశ్‌. తెలుగులో 24గంట‌ల న్యూస్‌ఛాన‌ల్‌ను ప్రారంభించి సంచ‌ల‌నానికి కేంధ్ర‌బిందువ‌య్యాడు. టీవీ9ను దేశ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల‌లో నెల‌కొల్పిన ర‌వి ప్ర‌కాశ్ తెలుగు రాష్ట్రాల్లో నెంబ‌ర్‌1 ఛాన‌ల్‌గా వెలుగుతుందంటే అది ర‌విప్ర‌కాశ్‌కున్న ప్ర‌తిభే. అలాంటి ర‌వి ప్ర‌కాశ్‌ను ఎదురొడ్డి దైర్యంగా ఎదుర్కొనే స‌త్తాలేని కొన్ని రాజ‌కీయ శ‌క్తులు అంత‌ర్గ‌తంగా కుట్ర‌లు చేసి టీవీ9ను హ‌స్త‌గ‌తం చేసుకున్నాయి. ర‌వి ప్ర‌కాశ్‌ను అవ‌మానక‌ర రీతిలో టీవీ9 నుంచి తొల‌గిపోయేలా చేసాయి.

అయితే మీడియా రంగంలో ఎదురు లేని వ్య‌క్తి ర‌వి ప్ర‌కాశ్. వ్యాపార రంగంలో తిరుగులేని శ‌క్తి ముఖేష్ అంబాని. ఇప్పుడు ర‌వి ప్ర‌కాశ్‌, ముఖేష్ అంబానీలు చేతులు క‌లిపేందుకు సిద్ద‌మ‌యిన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు సంచ‌లనం క‌లిగిస్తున్నాయి. ముఖేష్ అంబానికి న్యూస్‌18 మీడియా సంస్థ ఉంది. ముఖేష్ అంబాని దేశంలోని అన్ని ప్రాంతీయ భాష‌ల్లో న్యూస్ ఛాన‌ల్స్ ఏర్పాటు చేయాల‌ని గ‌తంలో ప్ర‌యత్నించారు. కొన్ని మీడియా సంస్థ‌ల‌ను కొనుగోలు చేయాల‌ని భావించినా అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు ర‌విప్ర‌కాశ్ నుంచి టీవీ9ను రాజ‌కీయ నాయ‌కులు గుంజుకోవ‌డంతో ర‌వి ప్ర‌కాశ్ కసిమీదున్నాడు. త‌న‌కు ఇలాంటి దుస్థితి క‌ల్పించిన క‌నిపించే వ్య‌క్తులు, క‌నిపించ‌ని రాజ‌కీయ శ‌క్తుల‌పై యుద్ధం చేయాల‌నే దృడ సంక‌ల్పంతో ఉన్నాడు.

దేశంలో మీడియాను రంగాని హ‌స్త‌గ‌తం చేసుకుని దేశ మీడియా రంగాన్నేశాసించాల‌ని క‌ల‌లు కంటున్న ముఖేష్ అంబానికి, త‌న‌ను అవ‌మానప‌రిచిన క‌నిపించిని, క‌నిపించే శ‌క్తుల‌పై పోరాటం చేయాల‌నే క‌సితో ఉన్న ర‌వి ప్ర‌కాశ్ జ‌ట్టు క‌ట్ట‌బోతున్న‌ట్లు మీడియా వ‌ర్గాల్లో వార్త హ‌ల్‌ఛ‌ల్ చేస్తుంది. ర‌వి ప్ర‌కాశ్ ఏ నిర్ణ‌యం తీసుకున్న అది ఊహ‌ల‌కు అందని విధంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో పేరున్న న్యూస్‌18 ద్వారా ముఖేష్ అంబాని అండ‌గా త‌న‌పై పెత్తనం లేని మీడియా రంగాన్ని సృష్టించాల‌ని అందుకు ముఖేష్ అంబానినే స‌రైన వ్య‌క్త‌ని ర‌వి ప్ర‌కాశ్ భావించిన‌ట్లు వినికిడి. అందులో భాగంగానే ర‌వి ప్ర‌కాశ్ ముంబైలో ముఖేష్ అంబానితో ఆదివారం రాత్రే భేటి జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. ఇదే గ‌నుక జ‌రిగితే తెలుగు రాష్ట్రాల్లో మ‌రో కొత్త‌మీడియా ప్ర‌జల ముందుకు రావ‌డం ఖాయం. అదే విధంగా ఎంతో టాలంట్ ఉన్న ర‌వి ప్ర‌కాశ్‌ను దేశంలోని అనేక మంది వ్యాపార వెత్త‌లు రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికేందుకు సిద్ద‌ప‌డుతున్న‌ట్లు మీడియా వ‌ర్గాల క‌థ‌నం. ఎన్నిక‌ల త‌తంగం ముగిసిన త‌రువాత ర‌విప్ర‌కాశ్ త‌న కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తారనే స‌మాచారం హ‌ట్ టాఫీక్‌గా మారింది.

tv9 రవి ప్రకాష్ మాస్టర్ ప్లాన్ .. ఈసారి మరో సంచలనమే !
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share