సెంటిమెంట్ చిత్తు చేసిన రోజా

May 25, 2019 at 9:09 am

చిత్త‌రు జిల్లా న‌గ‌రి నుంచి వ‌రుస‌గా రెండోసారి జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఈ ఎన్నిక‌ల్లో చాలా సెంటిమెంట్ల‌ను చిత్తు చిత్తు చేసింది. రోజాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొద్ది రోజులుగా ఐరెన్‌లెగ్ అన్న ముద్ర విప‌క్షాల నుంచి వ‌చ్చేసింది. విప‌క్షాలు…. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్లు దీనిని బాగా ప్ర‌చారం చేశారు. ఆమె టీడీపీలో ఉన్న‌ప్పుడు రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. 2004లో న‌గ‌రి, 2009లో చంద్ర‌గిరి నుంచి పోటీ చేసి ఓడిన రోజా ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

రోజా టీడీపీలో ఉన్న రెండుసార్లు టీడీపీ ఓడిపోవ‌డం… ఆ త‌ర్వాత ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లిన కొద్ది రోజుల‌కే వైఎస్ దివంగ‌తులు అవ్వ‌డంతో దీనిని ఓ బూచీగా చూపించి రోజాపై ఐరెన్‌లెగ్ ముద్ర వేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆమె న‌గ‌రిలో దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడిని ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు. రోజా టీడీపీ గాలిలోనూ ముద్దును ఓడించ‌డం పెద్ద సంచ‌ల‌న‌మే. రోజా గెలిచినా ప్ర‌భుత్వం రాక‌పోవ‌డంతో రోజాపై ఉన్న సెంటిమెంట్ల‌ను విప‌క్షాలు మ‌రింత గ‌ట్టిగా ప్ర‌చారం చేశాయి. ఈ ఎన్నిక‌ల‌కు ముందు కూడా టీడీపీ వాళ్లు సోష‌ల్ మీడియాలో దీనిని బాగా హైలెట్ చేశారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. న‌గ‌రిలో రోజా వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించ‌డంతో పాటు ఆమెపై సెంటిమెంట్లు అన్ని చిత్త‌య్యాయి. ఇటు ఆమె గెలిస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాద‌న్న సెంటిమెంటుతో పాటు న‌గ‌రిలో దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ సెంటిమెంట్ ఉన్నా దానిని కూడా త‌ట్టుకుని అక్క‌డ వ‌రుస‌గా రెండోసారి గెలిచారు.

2681 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే ఆర్కేరోజా సమీప ప్రత్యర్ధి గాలి భానుప్రకాష్‌పై విజయాన్ని సాధించారు. రెక్కల కష్టం తో ఆమె చేసిన పోరాటం విజయలక్ష్మిని వరింపచేసింది. ఈ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో రోజా గెలుస్తుందా ? అన్న సందేహాలు కూడా ఒకానొక ద‌శ‌లో క‌లిగాయి. 7వ రౌండ్‌లో 3,413 ఓట్ల మెజారిటీతో ఉన్న రోజా నగరి మున్సిపాలిటీ రౌండ్లయిన 8, 9, 10 ముగిసే సరిగి 421 ఓట్ల మెజారిటీకి రావడం పార్టీ శ్రేణులకు టెన్షన్‌ తెప్పించింది. నగరి రూరల్, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన రౌండ్లు 11 నుంచి 17 రౌండ్లలో వరుసగా మెజారిటీ రావడంతో 2681 ఓట్లతో రెండోసారి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా గెలుపొందారు.

సెంటిమెంట్ చిత్తు చేసిన రోజా
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share