ఎంపీ ప‌ద‌వికి టీడీపీతో సంబంధం లేదు: సుజ‌నా సంచ‌ల‌న కామెంట్స్‌

June 24, 2019 at 4:18 pm

ఇటీవ‌ల కేంద్రంలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్‌.. త‌దిత‌రులు.. గుండుగుత్తుగా పార్టీ మారిపోయారు. మొత్తానికి మొత్తంగా చంద్ర‌బాబుకు జ‌ల్ల‌కొట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, పార్టీలు మార‌డం అనేది ప్ర‌జాస్వామ్యంలో స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే, ఇప్పుడు వ‌చ్చిన చిక్క‌ల్లా ఇలా గోడ‌దూకే వారు.. మొత్తానికే మొత్తంగా.. పార్టీకి రాజీనామా చేస్తున్నారు త‌ప్పితే.. ఆ పార్టీ ద్వారా ల‌భించిన ప‌ద‌వికి మాత్ర రాజీనామా చేయ‌డం లేదు.

ఇదే ఇప్పుడు పెద్ద చిక్క‌తెస్తోంది. ప‌ద‌వులు ఉంటేనే త‌మ‌కు విలువ గౌర‌వం అని భావించే రోజుల నుంచి ఇప్పుడు మ‌రింతగా రోజులు మారిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీ గొడుగు కింద ఉంటేనే ఇప్పుడు నేత‌ల‌కు సంతృప్తి. ఇదే నేప‌థ్యంలో ఆ న‌లుగురు పార్టీ మారిపోయారు. అయితే, మీడియా మాత్రం ఎంతో కొంత కెలుకుతుందిక‌దా! ఇలానే సుజ‌నా చౌద‌రిని కూడా మీడియా కెలికింది. అయ్యా .. మీరు టీడీపీ నుంచి జంప్ చేసిబీజేపీలోకి వ‌చ్చారు. మ‌రి ఆ పార్టీ త‌ర‌ఫున ల‌భించిన ఎంపీ ప‌ద‌విని ఒదులుకోవ‌చ్చుక‌దా?! అని ప్ర‌శ్న‌ను సంధించింది. దీనికి సుజ‌నా అదిరిపోయే స‌మాధానం చెప్పారు.

మీడియా మిత్రులు స‌హా త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లు సైతం నోరు ఎత్త‌ని విధంగా స‌మాధానం చెప్పారు. అదేంటంటే.. త‌న‌కు వ‌చ్చిన రాజ్య‌స‌భ స‌భ్యుడి ప‌ద‌వి పార్టీ నుంచి వ‌చ్చింది కాద‌న్నారు సుజ‌నా చౌద‌రి..!! అప్ప‌టి ఎమ్మెల్యేలు త‌న‌ని ఎన్నుకున్నార‌న్నారు. ఇది నామినేటెడ్ పోస్ట్ కాద‌న్నారు. త‌న‌ను ఎన్నుకున్న శాస‌న స‌భ్యులు తెలుగుదేశం పార్టీవారే కాబ‌ట్టి… వారికి ధ‌న్య‌వాదానాలు చాలా సంద‌ర్భాల్లో చెప్పేశాన‌న్నారు. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి ఏది ఉప‌యోగ‌మో అదే చేస్తాన‌న్నారు.

ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా తాను పార్టీ మారేవాడిన‌న్నారు. ఎన్నిక‌ల ముందే మార‌దామ‌ని అనుకున్నాన‌నీ, కానీ ఒక పెద్దాయ‌న కొన్నాళ్లు ఆగ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌న్నారు. ఇన్నాళ్ల‌కు త‌న‌కు క‌మ‌ల నాథుల‌తో చెలిమి చేసే భాగ్యం క‌లిగింద‌ని పొంగిపోయారు. ఇలా త‌న పార్టీ మార్పు, ప‌ద‌వి మార్పుపై మ‌న‌సులో ఏమీ దాచుకోకుండా చెప్పేశారు సుజ‌నా?! అయితే, ప‌నిలో ప‌నిగా..త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిన పార్టీకి, ఎమ్మెల్యేల‌కు తాను చేసిన ఫేవ‌ర్ కూడా చెప్పేసి ఉంటే.. బావుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎంపీ ప‌ద‌వికి టీడీపీతో సంబంధం లేదు: సుజ‌నా సంచ‌ల‌న కామెంట్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share