టీడీపీలో ఆ ఆరుగురు మంత్రులు గిల..గిలా !

May 6, 2019 at 2:53 pm

రాష్ట్రంలో గ‌త నెల‌లో జ‌రిగిన సార్వ‌త్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఏపీలోని చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలోని చాలా మంది మంత్రులు చాలా ట‌ఫ్ ఫైట్ ఎదుర్కొన్నార‌ని అంటున్నారు. మారిన రాజ‌కీయ వ్యూహాలు, మ‌రోప‌క్క‌, వైసీపీ పూర్తి స్తాయిలో పుంజుకోవ‌డం, ఎమ్మెల్యేలుగా మ‌ళ్లీ రంగంలోకి దిగాల‌ని భావించిన నేత‌ల‌కు చంద్ర‌బాబు ఎంపీ టికెట్‌లు క‌ట్ట బెట్ట‌డం వంటి అనేక మార్పుల నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో కొంద‌రు మంత్రులు ఏటికి ఎదురీదిన‌ట్టు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో కొంద‌రు మంత్రులు పోటీ చేసిన స్థానాల్లో వైసీపీ నుంచి అన్ని విధాలా బ‌లంగా ఉన్న నాయ‌కులు పోటీ చేయ‌డం కూడా వీరి గెలుపుపై ప్ర‌భావం చూపిస్తోంద‌ని అంటున్నారు.

గుంటూరు జిల్లాకు సంబంధించి ఇద్ద‌రు మంత్రులు ఎదురీదుతున్నారు. చిల‌క‌లూరిపేట నుంచి ప్ర‌త్తిపాటి పుల్లారావు హ్యా ట్రిక్ దిశ‌గా వేసిన అడుగులు ఒకింత ఎదురీత‌గానే క‌నిపించాయి. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున బీసీ మ‌హిళ విడ‌ద‌ల ర‌జ‌నీ పోటీ చేశారు. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్నర ముందుగానే ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం, మంత్రికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయడం సంచ‌ల‌నంగా మారింది. ఎన్నిక‌ల వేళ భారీ ఎత్తున న‌గ‌దును కూడా ఆమె పంచి పెట్టారు. మైనార్టీ, బీసీలు కూడా ఆమెకు అనుకూలంగా ప‌నిచేశార‌ని అంటున్నారు. దీంతో పుల్లారావు హ్యాట్రిక్ ఆశ‌ల‌పై కారుమ‌బ్బులు క‌మ్ముకున్నాయి. మ‌రో మంత్రి న‌క్కా ఆనంద‌బాబుది కూడా ఇదే ప‌రిస్తితి.

వేమూరు నుంచి బ‌రిలోకి దిగిన న‌క్కా ఆనంద‌బాబుకు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. వ‌రుస విజ‌యాలు సాధించినా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా మారింద‌ని ప్ర‌జ‌లే వ్యాఖ్యానించారు. ఇక‌, వైసీపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి బ‌రిలో నిల‌వ‌డం ఇక్క‌డ ఆనంద‌బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఇక‌, కృష్ణాజిల్లా మైల‌వ‌రం లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించింది. వ‌రుస‌గా గెలుపు గుర్రం ఎక్కి, కేబినెట్‌లోనూ మంచి పొజిష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ మంత్రి దేవినేని ఉమా త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌నే వారు పెరిగారు. ఇక‌, ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేయ‌డం ఉమాకు ఎదురుదీన‌ట్టేన‌ని అంటున్నారు.

ఇక‌, ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నుంచి గెలిచి, మంత్రిగా గుర్తింపు పొందిన సిద్దా రాఘ‌వ‌రావుకు చంద్ర‌బాబు ఒంగోలుటికెట్ ఇచ్చారు. వాస్త‌వానికి ద‌ర్శి నుంచి పోటీ చేయాల‌ని భావించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న చివ‌రి నిముషంలో బాబు నిర్ణ‌యం మేర‌కు ఆయ‌న ఎంపీగా పోటీ చేశారు. ఇక్క‌డ వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డంతోమంత్రి సిద్దా గెలుపు అంత ఈజీకాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇద్ద‌రూ కూడా ఆర్థికంగా బాగానే ఖ‌ర్చు పెట్ట‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. మ‌రోప‌క్క‌, క‌డ‌ప‌లో గ‌త ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి విజ‌యం సాధించిన త‌ర్వాత వైసీపీకి రాం రాం చెప్పి టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌విని పొందారు ఆదినారాయ‌ణ‌రెడ్డి.

అయితే, ఆయ‌న ఈ ద‌ఫా చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అసెంబ్లీ బ‌దులుగా క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. నిజానికి ఇంత పెద్ద నిర్ణ‌యంతో ఆది మొద‌ట్లో త‌డ‌బ‌డ్డారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న క‌డ‌ప ఎంపీ నియోజ‌క వ‌ర్గంలో గెలుపు గుర్రం ఎక్క‌డంపై ఆయ‌న మొద‌ట్లోనే ఆశ‌లు వ‌దులుకున్నారు. అయినా బాబు నిర్ణ‌యంతో ఆయ‌న ఎంపీగానే బ‌రిలోకి దిగారు. ఇక్క‌డ కూడా ఈయ‌న‌కు ఎద‌రుగాలి వీచింది. అదేవిధంగా టెక్క‌లి నుంచి గెలిచిన మంత్రి అచ్చ‌న్నాయుడుకు ఈ ద‌ఫా ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇక్క‌డ కాళింగ సామాజిక వ‌ర్గం ఈయ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున తిల‌క్ పోటీ చేయ‌డం మ‌రింత ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఆయా మంత్రుల గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీలో ఆ ఆరుగురు మంత్రులు గిల..గిలా !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share