అఖిల‌ప్రియ‌కు అస‌లు సినిమా మొద‌లైందా….!

July 20, 2019 at 10:40 am

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు రాజకీయంగా చాలా లక్ కలిసి వచ్చింది. తల్లి శోభానాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత అనూహ్యంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల… ఆ తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డి మృతితో ఏకంగా మంత్రి అయ్యారు. అఖిల ఎమ్మెల్యేగా గెలవడమే ఏకగ్రీవంగా గెలిచింది. కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన మూడు ఏళ్లకే మంత్రి అయ్యింది. ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి టిక్కెట్ కోసం చంద్రబాబు దగ్గర గట్టిగా ఫైల్ చేశారు.

నంద్యాలలో తన సోదరుడు విజయం సాధించడంతో రాజకీయంగా ఆమెకు కాస్త ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇప్పుడు రాజకీయంగా అఖిల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. తాజా ఎన్నికల్లో అఖిల‌తో పాటు ఆమె సోదరుడు ఇద్దరు ఓడిపోయారు. ఆళ్లగడ్డ – నంద్యాల నియోజకవర్గాల్లో రాజకీయంగా టిడిపి ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేదు. ఇదిలా ఉంటే అటు అఖిల సొంత కుటుంబ సభ్యులతో కూడా గ్యాప్ వ‌చ్చింద‌న్న వార్తలు వస్తున్నాయి.

అఖిల మామ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అఖిల భార్గవ్ రామ్‌ను రెండో వివాహం చేసుకున్నాక కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అయిన గంగుల ఫ్యామిలీ గెల‌వ‌డంతో అఖిల బంధువ‌ర్గం మొత్తం ఇప్పుడు అటు వైపే స‌పోర్ట్ చేస్తోంద‌ట‌. ఇక ఇప్పుడు అఖిల తీరు న‌చ్చ‌ని వారంతా అఖిల‌ప్రియ తమ్ముడు విఖ్యాత్ రెడ్డిని.. అఖిలప్రియకు సోదరుడు అయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి తెస్తోన్నార‌ట‌.

బ‌ల‌మైన భూమా ఫ్యామిలీని నిల‌బెట్టే క్ర‌మంలో వీరిని బీజేపీలోకి తీసుకువెళ్లి… అఖిల స్థానంలో వీరికి హైప్ తీసుకువ‌చ్చేలా చేయాల‌న్న‌దే భూమా వ‌ర్గంగా తెలుస్తోంది. ఏదేమైనా సొంత వ‌ర్గ‌మే అఖిల ఇక రాజ‌కీయాలు మానుకోవాల‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇస్తోంది. ఈ ప‌రిణామాలు ప్ర‌స్తుతం ఆమెకు మింగుడు ప‌డ‌డం లేద‌ట‌. పార్టీ మారి పాత ప‌రిచ‌యాల‌తో వైసీపీలోకి వెళ‌దామ‌న్నా ఆమెను ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా లేదు.

అఖిల‌ప్రియ‌కు అస‌లు సినిమా మొద‌లైందా….!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share