రూటు మార్చుకున్న టీడీపీ ఫైర్ బ్రాండ్ బోండా ఉమా !

August 13, 2019 at 10:51 am

గత కొన్ని రోజులుగా బొండా ఉమా విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. టీడీపీ నేతగా ఉన్న ఈయన వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల విదేశీ పర్యటనకి వెళ్ళిన ఉమా…రాగానే జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆయన విదేశీ పర్యటన నుంచి విజయవాడ రాగానే చంద్రబాబు ధూతగా బుద్దా వెంకన్న ఉమా ఇంటికి వెళ్ళి పార్టీ మార్పుపై చర్చించారు. దీని తర్వాత బుద్దా మాత్రం ప్రెస్ తో మాట్లాడుతూ ఉమా టీడీపీలో ఉంటారని ప్రకటించారు.

కానీ ఉమా మాత్రం అధినేత చంద్రబాబుతో చర్చించాక మాట్లాడుతానని అన్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఉమా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారడం లేదని టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. ఎన్నికల తర్వాత తనకు చాలా పార్టీల నుంచి పిలుపులు అందాయని, కానీ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఇండియాలో లేని సమయంలో లేనిపోని వదంతులు పుట్టించారని, పార్టీ మారేవాడ్నే అయితే ఇప్పుడు చంద్రబాబు ఇంటికి ఎందుకు వస్తానని ఉమ ప్రశ్నించారు.

అయితే తప్పనిసరి పార్టీ మారిపోతారనే సమయంలో బొండా ఉమా హఠాత్తుగా రూటు ఎందుకు మార్చారని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఒకానొక దశలో పార్టీ మారబోతున్నట్లు ఉమా కూడా కొన్ని లీకులు ఇచ్చారు కూడా. కానీ ఇప్పుడు రివర్స్ అయ్యి టీడీపీలో ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మామూలుగా ఆయన వైసీపీలోకి వస్తే విజయవాడ ఈస్ట్ ఇస్తామని జగన్ వర్గం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఉమా సెంట్రల్ కావాలని అనుకుంటున్నారు. 2014లో ఇక్కడ టీడీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచారు. మొన్న ఎన్నికల్లో కూడా విజయం దగ్గర వరకు వచ్చి 25 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు.

కానీ తనకు సెంట్రల్ వదులుకుని ఈస్ట్ కి వెళ్ళడం ఇష్టం లేదు. ఈస్ట్ లో ఇప్పుడు వైసీపీ నాయకుడు యలమంచిలి రవి పరిస్తితి ఎలా ఉందో తెలుసు. మళ్ళీ వైసీపీలోకి వెళితే ఆయన లాగా అవ్వడం ఇష్టం లేక టీడీపీలోనే ఉండేందుకు ఫిక్స్ అయ్యారట. టీడీపీలో ఉంటే సెంట్రల్ ఎప్పటికీ తనదే. అందుకే తనకు కమ్ఫర్ట్ ఉన్నచోట ఉంటేనే బెటర్ అనుకుని నా ప్రయాణం టీడీపీలోనే అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉమాకి సరైన అవకాశం దొరక్క టీడీపీలో ఉండటానికి సిద్ధమయ్యారు అనమాట.

రూటు మార్చుకున్న టీడీపీ ఫైర్ బ్రాండ్ బోండా ఉమా !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share