టీడీపీ డిజాస్టర్ కి మూడు కారణాలు ఇవేనా !

May 25, 2019 at 10:30 am

ఏపీలో టీడీపీ పార్టీ చ‌రిత్ర‌లోనే ఘోరాతి ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత‌గా అతి త‌క్కువుగా కేవ‌లం 23 ఎమ్మెల్యే సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. అలాగే ఆ పార్టీ నుంచి పోటీ చేసిన 25 మంది ఎంపీల్లో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే విజ‌య‌వాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌, శ్రీకాకుళం నుంచి రామ్మోహ‌న్‌నాయుడు మాత్ర‌మే గెలిచారు. ఈ ముగ్గురు కూడా అతిక‌ష్టం మీద చెమ‌టోడ్చి మ‌రీ గెలిచారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా వైసీపీకి, ఆ పార్టీకి మ‌ధ్య ఓట్ల శాతం కేవలం 1.98 మాత్ర‌మే ఉంది. ఈ సారి టీడీపీ కంటే వైసీపీకి ఏకంగా 10 శాతం ఓట్లు ఎక్కువుగా వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి టీడీపీ ఓట్ షేరింగ్ ఎంత ఘోరంగా ప‌త‌న‌మైందో తెలుస్తోంది. ఇక టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోవ‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. వీటిల్లో మూడు కార‌ణాలు ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీని ప‌త‌నం చేసేశాయి.

జ‌న‌సేన :
గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన‌కంగా బీజేపీతో పొత్తుతో పాటు ఇక్క‌డ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆ పార్టీకి అనుకూలంగా స‌పోర్ట్ చేయ‌డం. కోస్తాలో బ‌లంగా ఉన్న కాపు వ‌ర్గం ఓట‌ర్లు ప‌వ‌న్ స‌పోర్టుతో టీడీపీ అభ్య‌ర్థుల‌కు ఓట్లేశారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో సీమ‌లో వైసీపీ స‌త్తా చాటిని గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు పూర్తిగా తేలిపోయింది. ఇక ఇప్పుడు జ‌న‌సేన ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలుస్తుంద‌ని అంద‌రూ అనుకున్నా అందుకు పూర్తిగా జ‌రిగింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ప‌డితే.. టీడీపీ అనుకూల ఓట్ల‌లో కొంత జ‌న‌సేన లాక్కెళ్లిపోయింది. జ‌న‌సేన ప్ర‌భావంతోనే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ 10 ఎంపీ సీట్ల‌తో పాటు 30కు పైగా అసెంబ్లీ సీట్ల‌ను లాస్ అయ్యింది.

పోల్ మేనేజ్‌మెంట్‌, మ‌నీ మేనేజ్‌మెంట్ :
ఇక పోల్ మేనేజ్‌మెంట్‌, మ‌నీ మేనేజ్‌మెంట్ విష‌యంలో టీడీపీ చాలా వెన‌క‌ప‌డిపోయింది. అధికారంలో ఉండి కూడా చంద్ర‌బాబు ఈ విష‌యంలో వెన‌క‌ప‌డితే… అటు వైసీపీ వాళ్లు చాలా క‌సితో పోల్ మేనేజ్‌మెంట్ చేశారు. వైసీపీ వాళ్లు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్‌కు ముందే మూడు రోజులు మ‌నీ పంపిణీ చేస్తే… టీడీపీ వాళ్లు చాలా చోట్ల పోలింగ్ రోజు కూడా డ‌బ్బులు పంచుతూనే ఉన్నారు. ఇక కొంద‌రు పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకోవ‌డం… మ‌రికొంద‌రు ఎలాగూ ప‌సుపు – కుంకుమ గెలిపిస్తుందిలే అని అస్స‌లు డ‌బ్బులు బ‌య‌ట‌కు తీయ‌క‌పోవ‌డంతో సుమారు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఓడిపోయింది.

జ‌న్మ‌భూమి కమిటీలు :
ఇక జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో చంద్ర‌బాబు పార్టీని స‌గం నాశ‌నం చేసేశారు. క‌మిటీల‌తో చాలా మంది విప‌క్ష పార్టీల‌కు చెందిన వారి ద‌గ్గ‌ర కూడా డ‌బ్బులు తీసుకుని వారికి ప‌నులు చేసిపెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక సొంత పార్టీ నేత‌ల ద‌గ్గ‌ర కూడా డ‌బ్బులు తీసుకుని ప‌నులు చేయ‌డంతో పాటు కొంద‌రికే ప్రాధాన్యం ఇవ్వ‌డం… ఫించ‌న్లు లాంటివి ఎమ్మెల్యేల‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఇవ్వ‌డంతో పార్టీకి ప్రాధాన్యం లేకుండా పోయింది.

టీడీపీ డిజాస్టర్ కి మూడు కారణాలు ఇవేనా !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share