టీడీపీలో కాపుల జోరు… క‌మ్మ‌ల బేజారు

July 4, 2019 at 12:40 pm

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన ప్రకంపనలు రేగుతున్నాయి. ఎవరు ఎప్పుడూ పార్టీకి షాక్ ఇస్తారు… ఎవరి నుంచి ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ఎదుర్కోవలసి వస్తుందో ? పార్టీ అధినేత చంద్రబాబు ఊహించలేక పోతున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్ళిపోయారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజికవర్గంలో ఈసారి స్పష్టమైన మార్పులు వచ్చాయి.

చంద్రబాబు సామాజిక వర్గంలో కొంతమంది కీలక నేతలను అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో వారంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే వీరంతా ఎన్నికలకు ముందు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు. జగన్ గత ఎన్నికలకు భిన్నంగా క‌మ్మ‌లు ఎక్కువుగా ఉన్న జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటం కూడా అ వర్గంలో చీలికకు ప్రధాన కారణం.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపిలో కాపు నేతలంతా ఒక్కటవుతున్నారు. పార్టీలో తమ ఆధిపత్యం కోసం వారు సొంతంగా సమావేశాలు పెట్టుకోవ‌డంతో పాటు కొన్ని కీలక విషయాల్లో చంద్రబాబుపై సైతం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి స‌క్సెస్ అవుతున్న‌ట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీ రోల్ అంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే పోషించేవారు. ఇక బీసీలు అంటేనే టిడిపి … టిడిపి అంటేనే బీసీలు అన్నట్టుగా ఆ సామాజికవర్గాలు అన్నీ తెలుగుదేశం పార్టీ వెంటే నడుస్తూ వచ్చాయి.

తాజా ఎన్నికల్లో బీసీల్లో సైతం మెజార్టీ వర్గాల్లో చీలిక రావడంతో ఎన్నికల్లో టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎక్కువగా కాపు జపం చేయడం కూడా… బీసీల్లో కొందరికి నచ్చలేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అదే టైంలో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం…. సీమ జిల్లాల్లో బీసీలకు ఏకంగా మూడు ఎంపీ సీట్లు బీసీల‌కు ఇవ్వడంతో పాటు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న రాజమహేంద్రవరం లోక్‌స‌భ సీటును కూడా ఆ వర్గానికి ఇవ్వడంతో బీసీలంతా వైసీపీకి జై కొట్టారు.

ఇక ఎన్నికల ఫలితాలు వచ్చాక టీడీపీలో కాపు నేతలంతా కాకినాడలో పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియకుండానే రహస్యంగా సమావేశమయ్యారు. పైగా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు సమావేశం అయిన వీరు తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చించడంతో పాటు పార్టీలో తమ మాట ఎలా ? నెగ్గించుకోవాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించారట. తాజాగా చంద్రబాబు భేటీ అయిన వీరు ఎన్నికలకు ముందు కాపు నేతల‌కు పార్టీలో స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌ని త‌మ అక్రోషాన్ని వెళ్ల‌గ‌క్కార‌ట‌.

ఓ వైపు బీసీల్లో కొంద‌రు దూరం కావ‌డం.. ఇటు కాపులు ప‌వ‌న్ కంటే చంద్ర‌బాబు, టీడీపీతోనే ఉండేందుకు ఆస‌క్తి చూపిస్తుండ‌డంతో ఇప్పుడు వాళ్ల డిమాండ్ల‌కు బాబు త‌లొగ్గ‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింద‌ట‌. అదే టైంలో ఒక‌ప్పుడు పార్టీని శాసించిన క‌మ్మ‌లు సైలెంట్ అవుతుండ‌డంతో పాటు త‌మ అవ‌స‌రాల నేప‌థ్యంలో అటు జ‌గ‌న్‌కు కూడా ద‌గ్గ‌ర‌వుతుండ‌డంతో ఇప్పుడు టీడీపీలో కాపు జోరు ఎక్కువు అవుతున్న‌ట్టే స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది.

టీడీపీలో కాపుల జోరు… క‌మ్మ‌ల బేజారు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share