బాబుకు షాక్‌… టీడీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై

July 10, 2019 at 5:32 pm

ఏపీలో టీడీపీకి మరో అదిరిపోయే షాక్ తగిలింది. రాజధాని అయిన గుంటూరులో వరుసగా రెండో రోజు రెండో వికెట్ పడనుంది. మంగళవారం గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సాంబశివరావు బిజెపిలో చేరేందుకు తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం మరో అదిరిపోయే షాక్ తగిలింది. ఎమ్మెల్సీ… బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీతో పాటు.. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

2014లో కాపు సామాజిక వర్గం కోటాలో సీటు దక్కించుకున్న సతీష్ ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు జిల్లాలో కాపుల‌కు ప్ర‌యార్టీ ఇవ్వాల్సి ఉన్న నేప‌థ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్నా… బాప‌ట్ల సీటు కోసం గ‌ట్టి పోటీ ఉన్నా మ‌రోసారి స‌తీష్‌కే సీటు ఇచ్చారు. స‌తీష్ వ‌రుస‌గా రెండోసారి కూడా రఘుపతి చేతిలో మరోసారి ఓడిపోయారు.

ఇక మంగ‌ళ‌వారం టీడీపీకి గుడ్ బై చెప్పిన చందు సాంబ‌శివ‌రావు, స‌తీష్ ఇద్ద‌రూ ప్ర‌తిసారి ప‌ద‌వుల కోసం పోటీప‌డ్డారు. ఎమ్మ‌ల్సీ సీటు విష‌యంలో స‌తీష్‌కే ఓటు వేసిన బాబు… తాజా ఎన్నిక‌ల్లో వెస్ట్ సీటు ఆశించిన చందును కాద‌ని మ‌ళ్లీ స‌తీష్‌కే సీటు ఇచ్చారు. అయితే ఇప్పుడు ప‌ద‌వి ఇచ్చిన నేత‌తో పాటు ప‌ద‌వి రాని నేత ఇద్ద‌రూ ఒక రోజు తేడాలో బాబుకు షాక్ ఇచ్చారు. చందు సాంబ‌శివ‌రావు ఇప్ప‌టికే బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. మ‌రి స‌తీష్ ఏ పార్టీలోకి వెళ‌తాడో ? చూడాలి.

బాబుకు షాక్‌… టీడీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share